Imaran Khan: భారత్ అంటేనే తరచూ విరుచుకుపడే పాకిస్తాన్ ప్రధాని..తాజాగా కాళ్లకిందకు నీళ్లు వచ్చేసరికి తత్త్వం బోధపడి ఇప్పుడు భారత్ గ్రేట్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. భారత్ ను, భారత ఆర్మీ గొప్పతనాన్ని ప్రశంసిస్తూ పాకిస్తాన్ ఆర్మీపై దారుణ విమర్శలు చేశాడు. తొలిసారి భారత్ కు అనుకూలంగా మాట్లాడి ఆశ్చర్యపరిచాడు.

అమెరికా ఆంక్షలు ఉన్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు దిగుమతి చేసుకొని స్వతంత్ర విదేశీ విధానాన్ని భారత్ అనుసరించిందంటూ ఇమ్రాన్ ఖాన్ మెచ్చుకున్నారు. స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తున్న మన పొరుగుదేశం భారత్ ను నేను అభినందిస్తున్నానని ఇమ్రాన్ ఖాన్ అనడం ఆ దేశ ఆర్మీకి పుండుమీద కారం చల్లినట్టైంది.
ఇక పాకిస్తాన్ ఆర్మీని ఆయన తూర్పారపట్టారు. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యాన్ని ప్రతీసారి కూల్చుతోందని పరోక్షంగా విమర్శించాడు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. పలువురు ఎంపీలు ప్రతిపక్షానికి మద్దతు తెలిపి ఇమ్రాన్ ఖాన్ పై తిరుగుబాటు చేశారు. దీని వెనుక పాకిస్తాన్ ఆర్మీ ఉందని ఇమ్రాన్ ఖాన్ ఆరోపిస్తున్నారు. ఆర్మీనే తనను దించేసి వేరొకరిని ప్రధానిని చేయాలనుకుంటోందని ఆరోపిస్తున్నారు. ప్రజా మద్దతు కోసం ఇమ్రాన్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తనపై ప్రతిపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఆయన ఖండిస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా భారత్ ఆర్మీని మెచ్చుకున్నారు. భారత ఆర్మీ అక్కడి ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అలాగే భారత విదేశాంగ విధానం అద్భుతంగా ఉంటుందని.. పౌరుల కోసం ఎంతకైనా తెగిస్తుందంటూ ఇమ్రాన్ ఖాన్ ఆకాశానికి ఎత్తేశారు.
ఇక భారత్ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గని దేశమని.. విధానాలు సక్రమంగా ఉండడం వల్లే తటస్థ వైఖరి అవలంభిస్తుందంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. భారత్ విధానాలు ఆ దేశానికి ఎంతో మేలు చేస్తున్నాయని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు.
తనపై అవిశ్వాసం పెట్టి ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్న విపక్షాల ఒత్తిళ్లకు తొలొగ్గనని.. పాకిస్తాన్ ఆర్మీకి డబ్బులు ఇచ్చి ప్రభుత్వాన్ని, పదవిని నిలబెట్టుకోలేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇలా సొంత దేశాన్ని, పాకిస్తాన్ ఆర్మీపై తీవ్ర విమర్శలు చేసిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శత్రుదేశమైన భారత్ ను పొగడడం సంచలనమైంది. ఇప్పటికైనా భారత్ గురించి తెలుసుకొని పాక్ ఆర్మీ కుటల నీతిని అర్థం చేసుకున్న ఇమ్రాన్ పై మన దేశంలో సానుభూతి వ్యక్తం అవుతుండగా.. పాక్ ఆర్మీ మాత్రం ఇమ్రాన్ ను గద్దెదించడానికే రెడీ అయ్యింది.
Recommended Video: