Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజుల నుండి వారాహి విజయ యాత్ర ని విజయవంతంగా కొనసాగిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రారంభమైన ఈ యాత్ర, నేడు భీమవరం వరకు చేరుకుంది. భీమవరం లో నేడు జరిగిన సభకి అభిమానులు వేలాదిగా తరళివచ్చి అడుగడుగునా పవన్ కళ్యాణ్ కి నీరాజనాలు పలికారు. గత రెండు రోజుల నుండి ఆయన భీమవరం లోనే ఉన్నాడు.28 వ తారీఖునే ఆయన సభ ని నిర్వహించాల్సి ఉంది. కానీ విపరీతమైన జ్వరం రావడం వల్ల, నేటి వాయిదా వేశారు. ఈ గ్యాప్ లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ పవన్ కళ్యాణ్ పై రీసెంట్ గా జరిగిన అమ్మవడి సభలో చాలా తీవ్రమైన విమర్శలు చేసాడు. ఆయన వ్యక్తిగత విషయాలను బయటకి తీసి చాలా నీచంగా మాట్లాడాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలా వ్యక్తిగత విమర్శలు చెయ్యడం వైసీపీ పార్టీ కార్యకర్తలకు కూడా మింగుడు పడనివ్వకుండా చేసింది.
దీనికి భీమవరం లో పవన్ కళ్యాణ్ చాలా ధీటుగా సమాధానం చెప్పాడు. పవన్ కళ్యాణ్ భీమవరంలో మాట్లాడిన ముఖ్య అంశాలు ఇవీ
1) పోరాటం చాలా కీలకమైనది..పోరాటాన్ని తెలుగుజాతికి నేర్పిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గారికి, తెలుగు రాష్ట్ర సాధకుడు పొట్టి శ్రీరాములు గారికి ధన్యవాదాలు, అంబేద్కర్ గారికి ధన్యవాదాలు..
2) నేను భీమవరంలో ఓడిపోయాను అని అనుకోవడం లేదు..ఓడిపోతే ఈ సభ ఇంత నిండుగా ఉండదు..
3) ముఖ్యమంత్రి పాలన వలన చెట్లు కూడా రోదిస్తున్నాయి..ఎక్కడ పర్యటన ఉంటే అక్కడ చెట్లు నరికేస్తున్నారు..అలా ఉంది..
4) లక్ష కోట్ల మద్యం అమ్మకాలు, జాబ్ కాలెండర్, 30000 ఆడపడుచుల మిస్సింగ్..ఏది మీ స్పందన??? మన సమాజం పిరికితనంతో నిండిపోయింది..వైసీపీ ఈ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది..
5) మనం పోరాడుతున్నది ఈ వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు, వ్యవస్థలు తట్టుకుని నిలబడి ఉన్నాం..ఈ గూండా వ్యవస్థ, ఈ దోపిడీ వ్యవస్థను నిరంతరం ఎదుర్కున్నాం..
6) 75% పరిశ్రమల్లో ఉద్యోగాలు స్థానిక యువతకు ఉపాధి అన్నారు..ఐటీ పరిశ్రమలు తెచ్చి ఆంధ్రప్రదేశ్ యువతను హైదరాబాద్, బెంగుళూరు వెళ్ళకుండా ఇక్కడే ఉద్యోగాలు అన్నారు..కనీసం జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు..
7) యువత అధికంగా ఈ రాష్ట్రంలో యువతను పట్టించుకోకపోవడం ఈ వైసీపీ పతనానికి నాంది కావాలి..
8) వాలంటీర్ ఉద్యోగాల వలన యువత ప్రతిభను తొక్కేసారు..మీలో సమర్థత ప్రతిభ బయటకు తీయాలి..మీలో ఎంతో ప్రతిభ ఉంది..నేను మీకు అండగా ఉంటాను..నికోలస్ టెస్లా, సత్య నాదెళ్ల లాంటి యువత ఉన్న నేల ఇది..
9) అంబేద్కర్ సెంటర్లో సభ సాక్షిగా చెబుతున్నాను..ఈ వైసీపీ ప్రభుత్వం 23 దళిత పథకాలు తీసేశారు..
10) ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతను ఎంపిక చేసి ఒక్కొక్కరికీ 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి, జనసేన ప్రభుత్వలో వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతాం..
11) సెమీకండక్టర్ పరిశ్రమలు, ఒలింపిక్ క్రీడలలో మత్స్యకార యువతకు ట్రైనింగ్, యువతకు ఐటీ ఉద్యోగులు తెచ్చి తీరుతాం జనసేన ప్రభుత్వంలో..
12) క్లాస్ వార్ అంటే డబ్బున్న వాడు పేదలని దోచుకునే వాళ్ళను క్లాస్ వార్ చేసే వాళ్ళు అంటారు..కోపమొస్తే తిరగబడతారు..ఊగిపోతారు..నీలా పళ్ళు ఇకిలించడు జగన్ రెడ్డి..
13) కొండపల్లి సీతారామయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి లా గొప్ప నాయకుడి లాగా బిల్డప్ ఇచ్చే వ్యక్తి జగన్ రెడ్డి..
14) భవన నిర్మాణ కార్మికులు, కౌలు రైతులను ఆదుకోని నువ్వా నేనా క్లాస్ వార్ చేసేది??? సిగ్గుండాలి ఈ ముఖ్యమంత్రికి..
15) కల్తీ మద్యం అమ్ముతున్నాడు..మీ ఆరోగ్యాలు నాశనం చేసి పాలన చేస్తున్నాడు.. మద్యపాన నిషేధం ఏది.??
16) గంగవరం పోర్టులో మత్స్యకార జీవితాలను బలి చేసిన మీ ప్రభుత్వం వారికి న్యాయం చేయలేదు..700 మందికి భూములు కోల్పోయిన వారికి సరైన న్యాయం చేయలేదు..ఉపాధి తీసేసిన నువ్వా క్లాస్ వార్ గురించి మాట్లాడేది జగన్ రెడ్డి..
17) అన్నీ పదవులు ఒక సామాజిక వర్గానికి కట్టబెట్టిన నువ్వు క్లాస్ వార్ గురించి మాట్లాడేది జగన్ రెడ్డి??
18) బ్రిటిష్ వారు కేవలం 5000 మంది వచ్చి భారతదేశాన్ని ఆక్రమించినట్టు మీ ఒక కులం వారే రాష్ట్రాన్ని ఎక్కి తొక్కుతాం అంటే ఇక్కడ నేను ఊరుకోను జగన్ రెడ్డి..
19) కరెంట్ ఛార్జీలు 8 సార్లు పెంచారు..ఆక్వా ఫీడ్ లో టన్నుకు 4000 రూపాయలు తాడేపల్లి ముఖ్యమంత్రికి జె ట్యాక్స్ కట్టాలి..ధరలు పెరిగిపోయాయి..
20) స్థానిక ఎమ్మెల్యే ఇక్కడే ఉంటా అని డప్పు కొడతాడు.. ఎప్పుడైనా భీమవరం డంపింగ్ యార్డ్ కి వెళ్ళాడా?? నేను వెళ్ళాను నేను పోటీ చేసిన భీమవరంలో..100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయలేని వ్యక్తి ఇతను..
21) గాంధీ గారు సత్యశోధన అని పుస్తకం రాస్తే… జగన్ రెడ్డి MY EXTORTION అని పుస్తకం రాస్తారు..
22) మీ నాన్న చనిపోతే ఓదార్పు యాత్ర చేసావే..32 మంది భవన నిర్మాణ కార్మికులు చనిపోతే ఓదార్పు చేసినది నేను..ప్రజల కోసం నేను..
23) రోడ్డు లేదని పాదయాత్ర చేసినందుకు అరెస్టు చేసిన వ్యక్తి జగన్ రెడ్డి..నిత్యం అరాచకాలు చేసే వైసీపీ కార్యకర్తల మీద కేసులు ఏవి జగన్ రెడ్డి???
24) ఆక్వా వలన ఆదాయం ఉంది..కాలుష్యం ఉంది..రెండు సరిచేసే వ్యవస్థను జనసేన తీసుకొచ్చి తీరుతుంది..తుందుర్రు యువతకు ఆక్వాపార్క్ విషయంలో న్యాయం చేస్తాం..
25) దళితుల ఇళ్ళు ఖాళీ చేయించారు..గరగపర్రులో ఇళ్ళు కూల్చేశారు..ఒకటికి రెండింతలు అండగా ఉంటాను 36వ వార్డు ప్రజలకు..
26) వచ్చే ఎన్నికల్లో మనస్ఫూర్తిగా నన్ను ఇక్కడ గెలిపిస్తారని అనుకుంటున్నాను..నా పోరాటం ఆపను..జనసేన జెండా ఎగరాలి.. బీసీలకు రాజ్యాధికారం కావాలి..దళితుల నుండి పారిశ్రామికవేత్తలు రావాలి..
27) సినిమా హీరోల అభిమానులు అందరూ కలిసి జనసేన వైపు ఉండండి.. మిమ్మల్ని విడదీయడం నాకు ఇష్టం లేదు..సినీ హీరో అభిమానులుగా విడదీయడం ఇష్టం లేదు నాకు..ఆంధ్రప్రదేశ్ యువత మీరు..మీరంటే ఇష్టం నాకు..మీ జీవితాలు బావుండాలి..కలిసుండండి.. జనసేన వైపు ఉండండి..
28) మీ నోటికి సైలెన్సర్లు తీసేసి, మా వాళ్ళ బైకుల సైలెన్సర్లు తీసేసాం అని ఏడవద్దు.. మీ నోరు సరిగ్గా ఉంటే మా సైలెన్సర్లు సరిగ్గా ఉంటాయి..
29) ప్రజాసమస్యల మీద మాట్లాడే నేను, నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే జగన్ రెడ్డి..ఎవడు చిల్లరోడు??? నీ వ్యక్తిగత జీవితం గురించి నేను మాట్లాడితే మీ చెవుల్లో నుండి రక్తం వస్తుంది..జాగ్రత్త..
30) రాష్ట్రం అప్పుల్లో కూరుకుని ఉన్నది.. జీతాలు, వంతెనలు, ఫీజు రీయింబర్స్మెంట్ లేవు.. ఏవి ఇవన్నీ?? అప్పులు చేసి అధోగతి పాలు చేసారు..
31) వచ్చే ఎన్నికల్లో మూడు ప్రధానమైనవి..విద్య, వైద్యం, ఉపాధి..కేజీ టు పీజీ చదివించాలి.. ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాలల్లో ఇన్సూరెన్స్ విధానాన్ని తీసుకొస్తాం.. ప్రభుత్వం నుండి 5 లక్షలు చొప్పున ఒక్కొక్కరికీ ఇన్సూరెన్స్ కడతాము..యువతకి 10 లక్షల చొప్పున ఒక్కొక్కరికీ నియోజకవర్గంలో 500 మందికి పెట్టుబడి సాయం చేస్తాం.. జనసేనని గెలిపించండి..
32) భగవంతుని సొమ్మును మింగేసేవాడిని దేవుడు మింగేస్తాడు..వైవీ సుబ్బారెడ్డి గారు జాగ్రత్త.. శ్రీవాణి ట్రస్ట్ అవకతవకలు , దుర్వినియోగం చేస్తూ ఆడుకోకండి ..
33) అరాచకం ఆగాలంటే వైసీపీ పోవాలి..
జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి..