Impact Of Removing Article 370D: ఆర్టికల్ 370 డి రద్దుతో మోడీ సాధించేంటి? కశ్మీర్ లో వచ్చిన మార్పేంటి? అన్నది చర్చనీయాంశమైంది. 2019 ఆగస్టు 4న ఆర్టికల్ 370డి ని రద్దు చేసి కశ్మీర్ ను భారత్ లో ఒక రాష్ట్రంగా అంతర్భాగంగా చేసింది. అయితే నిన్న రాహుల్ గాంధీ ‘కశ్మీర్’ విలీనం పెద్ద పొరపాటు అని తమిళనాడులో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
ఆనాడు పార్లమెంట్ లో మద్దతిచ్చిన రాహుల్ గాంధీ.. ఈనాడు వ్యతిరేకించి అభాసుపాలైంది. నాడు బీహార్ ఎన్నికల వేళ మద్దతిచ్చిన రాహుల్ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది.అదే రోజు ఇలా మాట్లాడితే బీహార్ లో పూర్తిగా తుడిచిపెట్టుకొని పోయేవాడు. బీహార్ లో అయినా కాంగ్రెస్ కు డిపాజిట్లు పోయాయి.
ఈ 75 ఏళ్లలో కాంగ్రెస్ ను ఎవరూ పరిష్కరించలేకపోయారు. కొత్త ప్రయోగం మోడీ చేశారు. దీనివల్ల ఏం సాధించారు. మోడీ కశ్మీర్ కు 80వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. విద్యుత్, ప్రాజెక్టులు తెచ్చాడు. మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులు, రహదారులు, బ్రిడ్జిలు సహా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఇక ముఖ్యమైన ఉగ్రవాదాన్ని కట్టడి చేశారు.ఇవన్నీ విజయాలే..
Also Read: ప్రాంతీయ పార్టీలు దేశానికి అవసరమా? కాదా?
రెండున్నరేళ్లలో మోడీ అంతకంటే పెద్ద విజయం సాధించాడు. కొత్తతరంలో మార్పు తీసుకొచ్చాడు. ఒకనాడు అందరూ రాడికల్ ఇస్లాం వైపు పోతున్న వారిని ఇప్పుడు అభివృద్ధిలో మోడీ భాగస్వామ్యం చేశారు. కశ్మీర్ లోని లాల్ చౌక్ లో 75 ఏళ్లలో తొలిసారి మువ్వెన్నల జెండా ఎగిరింది. ప్రభుత్వ స్కూళ్లు, ఆఫీసుల్లో జాతీయజెండా తొలిసారి ఎగిరింది. ఇదే మోడీ సాధించిన అతిపెద్ద విజయం. యువకులు స్థానిక సంస్థల ఎన్నికల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్ జరిగింది. ఇదే మోడీ సాధించిన గొప్ప ఘనత. వ్యాపారాలు, క్రీడల్లో యువత బాగా వృద్ధి చెంది ఉగ్రవాద కార్యకలాపాలు బాగా తగ్గాయి. ఇదే మోడీ సాధించిన విజయంగా చెప్పొచ్చు. దీనిపై సవివరణ విశ్లేషణను ‘రామ్’ గారు అందించారు. ఆ వీడియోను కింద చూడొచ్చు.
Also Read: అమరావతి సాకారం వెనుక ‘బీజేపీ-జనసేన’