Mosquito
Mosquito : దోమల సమస్య మనకే కాదు ప్రపంచంలోని అన్ని దేశాలకు ఉంది. దోమల కారణంగా ఏటా వేలాది మంది వ్యాధులకు గురై చనిపోతున్నారు. దోమలు కుట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అవి కుట్టడం మాత్రం ఆగడం లేదు. దోమల సమస్య ఇప్పుడిప్పుడే వచ్చిందేమీ కాదు. దోమలను నివారించడానికి ఇంట్లో చాలా పద్ధతులను అవలంబిస్తుంటాం. గుడ్ నైట్ రీఫీల్స్, కాయిల్స్ , దోమ తెరలు ఇలా ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటాం. కొన్నిసార్లు ఏకంగా దోమల మందు కూడా పిచికారీ చేస్తాం. ఇంట్లోకి దోమలు రాకుండా ఇంటి తలుపులు, కిటికీలను సాయంత్రం కాగానే మూసేస్తాము. కానీ అవి సంధు గొందుల్లోంచి ఇంట్లోకి దూరి మనల్నీ తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. దోమల భయం రోజురోజుకు పెరుగుతూనే ఉంది. దీంతో ఒక దేశ ప్రభుత్వం దోమలను చంపినందుకు ఏకంగా బహుమతిని ప్రకటించింది.
ఏంటి జోక్ అనుకుంటున్నారా.. లేదండి నిజం. ఫిలిప్పీన్స్ లో ఇలాంటిదే జరిగింది. ఆ దేశంలోని అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో డెంగ్యూ విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది. దీనిని నివారించడానికి అక్కడి ప్రభుత్వాలు పలు రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే సెంట్రల్ మనీలాలోని బరంగే అడిషన్ హిల్స్ గ్రామ అధిపతి కార్లిటో సెర్నల్ దోమలు చంపినందుకు బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ప్రతి ఐదు దోమలను పట్టుకుని చంపినందుకు ఒక పెసో (రెండు US సెంట్ల కంటే తక్కువ) బహుమతిని అందజేస్తామన్నారు. అంటే మన కరెన్సీలో ఒక పెసో మారకపు విలువ రూ.1.50 అంటే 5 దోమలు చంపిన వారికి రూ.1.50 ఇస్తున్నారు. అదే 50 దోమలను చంపినట్ల చూపిస్తే.. రూ.15 ఇస్తారు. అదే 100 దోమలు చంపితే రూ.30 ఇస్తారు. ఇప్పటికే 21మంది తమకు రివార్డు వచ్చినట్లు తెలిపారు.
డెంగ్యూ ఒక్క ఫిలిప్పీన్స్ దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి సమస్యగా మారిపోయింది. ఇది వస్తే ఆస్పత్రిలో చేరాల్సిందే. రక్తకణాలు పడిపోతాయి. లక్షలకు లక్షలు వదులుతాయి. ఒక్కోసారి తీవ్రమై మరణం కూడా సంభవిస్తుంది. ఫిలిప్పీన్స్‌లో డెంగ్యూ కారణంగా ఇప్పటి వరకు 575 మంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం… 2024లో ప్రపంచవ్యాప్తంగా 10 వేల మంది డెంగ్యూ కారణంగా చనిపోయారు. ఇటీవలి అకాల వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా డెంగ్యూ కేసులు పెరిగాయని ఫిలిప్పీన్స్ అధికారులు చెబుతున్నారు. ఫిబ్రవరి 1న 28,234 కేసులు నమోదయ్యాయని, ఇది గతేడాది కంటే 40 శాతం ఎక్కువని ఆరోగ్య శాఖ తెలిపింది.
ఈ రివార్డ్ వార్తను సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. కొందరు ఈ ప్రకటనను ఎగతాళి చేస్తుంటే మరి కొందరు మాత్రం ఆ దేశంలోని ప్రజలు, నాయకులకు ప్రజల ఆరోగ్యం పట్ల ఉన్న శ్రద్ధను కొనియాడుతున్నారు. ఫిలిప్పీన్స్‌లో దోమల ద్వారా సంక్రమించే డెంగ్యూ కేసులు ఇటీవల పెరిగిన నేపథ్యంలో ఆ దేశంలోని సదరు గ్రామ పెద్ద ఇలాంటి చర్యను తీసుకోవాల్సి వచ్చింది.
☎️ Magpakonsulta agad sa pinakamalapit na health center kapag nakaranas ng sintomas ng Dengue!
Ang malubhang Dengue ay nakamamatay. Ito ay dala ng lamok na Aedes aegypti na nagpaparami sa mga naipong tubig at maruruming lugar. pic.twitter.com/bNDzZujH75
— Department of Health Philippines (@DOHgovph) February 20, 2025