https://oktelugu.com/

YS Jagan Mohan Reddy : జగన్ కు భద్రత తగ్గింపు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు.. కేంద్ర మంత్రితో చంద్రబాబు చర్చలు!

ఏపీలో వరుసగా జరుగుతున్న పరిణామాలు రాజకీయంగా వేడెక్కిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు.

Written By: , Updated On : February 20, 2025 / 03:33 PM IST
YS Jagan Security

YS Jagan Security

Follow us on

YS Jagan Mohan Reddy :  జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy) భద్రతపై వివాదం కొనసాగుతోంది. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శించే జగన్ కు భద్రత కల్పించకపోవడంపై వైసీపీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు. జగన్ సైతం కూటమి సర్కార్ తీరును ఎండగట్టారు. తనకు భద్రత తగ్గించడం పై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ కారణంగా భద్రత కల్పించలేదని వాదనతో వైసిపి నేతలు ఏకీభవించడం లేదు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గవర్నర్ తో సమావేశం అయ్యారు. గుంటూరులో మిర్చి రైతులను పరామర్శ కోసం వెళ్లిన సమయంలో జగన్ కు భద్రత కల్పించలేదని ఫిర్యాదు చేశారు. జడ్ ప్లస్ కేటగిరి లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కి ఎన్నికల కోడ్ తో సంబంధం ఉండదని పేర్కొన్నారు.

* బొత్స విసుర్లు
మరోవైపు జగన్ కు భద్రత కల్పించకపోవడంపై శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స(botsa Satyanarayana ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చట్టం తన పని తాను చేసుకునేలా ప్రభుత్వం సహకరించాలని కోరారు. మ్యూజికల్ నైట్ కు అడ్డురాని కోడ్.. రైతుల పరామర్శకు వస్తుందా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భద్రత ఇవ్వలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డికి భద్రత ఇవ్వలేని పరిస్థితుల్లో ఆ విషయం ముందుగా ప్రభుత్వం తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. పాము భద్రత ఇవ్వలేమని ముందుగానే చెప్పి ఉండాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు.

* జగన్ తో పాటు 8 మంది పై కేసులు
మరోవైపు జగన్మోహన్ రెడ్డి మిర్చి రైతుల పరామర్శకు సంబంధించి అతనితో పాటు 8 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు పోలీసులు. ఎన్నికల కోడ్( election code) ఉన్న దృష్ట్యా నిబంధనలను మరిచి వ్యవహరించారని.. ట్రాఫిక్ కు సైతం అంతరాయం కలిగించారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకవైపు నిబంధనలు ఉల్లంఘించారని… చెబుతూనే భద్రత కల్పించకపోవడాన్ని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యవహారంగా చెబుతున్నారు.

* జగన్ పర్యటనలకు జనాలు
మొన్న విజయవాడ( Vijayawada) సబ్ జైలులో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు జగన్మోహన్ రెడ్డి. అదే రోజు రోడ్డు షో చేసినంత పని చేశారు. భారీగా జనాలు తరలివచ్చారు. అయితే ఆరోజు సైతం పోలీస్ భద్రత లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్ష నేత అంటే ప్రజల కోసం పనిచేస్తారని.. అటువంటి నాయకుడికి భద్రత కల్పించలేని స్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమని చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి భద్రతాంశం ఇప్పుడు వివాదంగా మారింది. ప్రస్తుతం చంద్రబాబు ఢిల్లీలోనే ఉన్నారు. మిర్చి రైతులకు సంబంధించి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో చర్చలు జరిపారు.