TTD Workers: జనసేన పార్టీ దూకుడు పెంచుతోంది. ప్రజాసమస్యల పరిష్కారానికి తనదైన శైలిలో పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ర్టంలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వంపై పోరు చేస్తోంది. ప్రజా సమస్యలే ఎజెండాగా ముందుకు సాగుతోంది. దీంతో పార్టీని జనంలోనే ఉంచాలని భావిస్తోంది. దీని కోసం అధికార పార్టీ విధానాలు ఎండగట్టేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల రాష్ర్టంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై స్పందించేందుకు రెడీ అవుతోంది.

ఇప్పటికే రాష్ర్టంలో రోడ్ల అధ్వాన స్థితిపై అక్టోబర్ లో ఆందోళన చేసి ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అదే సందర్భంలో ప్రజల సమస్యలు గుర్తించి వాటిపై పోరాడేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వారితో పాటు ఆందోళనకు దిగింది. దీంతో ప్రభుత్వం జనసేన నాయకులను అరెస్టు చేసింది. దీంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: టార్గెట్ చంద్రబాబు.. ఆయన మాజీ పీఎస్, ఐఏఎస్ ను వదలని సీఐడీ
ప్రజాసమస్యలు పరిష్కరించాలంటే అరెస్టులా అంటూ ప్రశ్నిస్తోంది. కార్మికులకు అండగా నిలిస్తే అది తప్పా? అని అడుగుతోంది. ప్రజాస్వామ్యంలో డిమాండ్ల సాధనకు ఆందోళన చేయడం హక్కు అని దాన్ని కాలరాసే హక్కు ఎవరికి లేదని చెబుతోంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ ప్రజల్లోకి వెళ్లడంలో అధినేత పవన్ కల్యాణ్ దిశా నిర్దేశంలో ముందుకు నడుస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నట్లు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్మికులు చేస్తున్న దీక్షలకు జనసేన సైనికులు మద్దతు ప్రకటించారు. అయితే వారి దీక్షలను అర్థరాత్రి ప్రభుత్వం భగ్నం చేసింది. దీంతో జనసేన పార్టీ నేతలు స్పందించారు. ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టింది. ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించింది.
Also Read: ఏపీకి పొంచి ఉన్న మరో ముప్పు