TRS Congress Alliance: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. ఇన్నాళ్లు త్రిముఖ పోటీ అనుకున్నా ద్విముఖ పోటీ ఉండనుంది. ఈ మేరకు కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు జత కట్టబోతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రెండు పార్టీలకు సమన్వయం చేస్తానని చెబుతుండటంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య పోరు ఉంటుందని తెలుస్తోంది. టీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ కావడంతో కాంగ్రెస్ తో జత కట్టేందుకు సమ్మతించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై జరిగే పరిణామాలు కూడా మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ కాంగ్రెస్ జట్టు కట్టి బీజేపీని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతన్నాయని బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో మరో దారి లేదు. దీంతోనే టీఆర్ఎస్ తో కలిసేందుకు కాంగ్రెస్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో పొత్తుకు శ్రీకారం చుడుతున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ తో జట్టు కట్టిన టీఆర్ఎస్ ఈసారి కూడా దాంతోనే కలిసి నడిచేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈక్రమంలో ఇన్నాళ్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై చేసిన విమర్శలకు ఏం సమాధానం చెబుతారనే ప్రశ్నలు సైతం వస్తున్నాయి.
మొత్తానికి పతనమైపోతున్న కాంగ్రెస్ పార్టీకి మిగిలిన ఏకైక ఆయుధం టీఆర్ఎస్ గానే భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు బీజేపీని ఎదుర్కొంటాయా? అధికారం చేజిక్కించుకుంటాయా? అనే సందేహాలు వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ తో కలిసేందుకు ఇష్టపడతారా? దాంతో నడిచేందుకు సమ్మతిస్తారా? ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న వారు కలిస్తే అద్భుతాలు వస్తాయా? పీకే మంత్రం తెలంగాణలో పని చేస్తుందా అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో పీకే మంత్రాంగం పనిచేసి లాభం చేకూరుతుందా? బీజేపీ దూకుడును అడ్డుకుంటుందా? కేసీఆర్ పాచికలు పారతాయా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఏదిఏమైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రవాహాన్ని అడ్డుకోవాలని భావిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని బీజేపీ నేతలు చెబుతున్నందుకు టీఆర్ఎస్ లో వణుకు పట్టుకుంది. అందుకే కాంగ్రెస్ తో జత కట్టి తన గెలుపు సునాయాసం చేసుకోవాలని భావిస్తోంది. దీంతో పీకే సూచనలకు రెండు పార్టీలు సమ్మతం తెలుపుతాయా? తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు సాధిస్తాయా? అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలే.
Recommended Videos



[…] Also Read: TRS Congress Alliance: టీఆర్ఎస్ , కాంగ్రెస్ పొత్తు ప… […]