ఇల్లు కట్టుకుంటే.. డిజైన్‌ మీ ఇష్టం

ప్రతీ పేదోడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏపీలోని జగన్‌ సర్కార్‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌‌ జగనన్న కాలనీల పేరిట కాలనీలు నిర్మిస్తోంది. అయితే.. వైఎస్సార్‌‌ జగనన్న కాలనీల్లో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణంలో డిజైన్‌ నిబంధనను ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ డిజైన్‌ పై అభ్యంతరాలు రావడంతో ఇంటిని సొంతంగా నిర్మించుకునేవారు తమ ఇష్టప్రకారమే కట్టుకునే వెసులుబాటు కల్పించింది. Also Read: ఉక్కు ఉద్యమం నుంచి వైసీపీ తప్పుకున్నట్లేనా..? బంద్‌కు మద్దతు లేనట్లేనా..? ముందుగా లబ్ధిదారులు […]

Written By: Srinivas, Updated On : March 4, 2021 2:42 pm
Follow us on


ప్రతీ పేదోడికి ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ఏపీలోని జగన్‌ సర్కార్‌‌ కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్‌‌ జగనన్న కాలనీల పేరిట కాలనీలు నిర్మిస్తోంది. అయితే.. వైఎస్సార్‌‌ జగనన్న కాలనీల్లో పేదల కోసం చేపట్టే ఇళ్ల నిర్మాణంలో డిజైన్‌ నిబంధనను ప్రభుత్వం సడలించింది. ప్రభుత్వ డిజైన్‌ పై అభ్యంతరాలు రావడంతో ఇంటిని సొంతంగా నిర్మించుకునేవారు తమ ఇష్టప్రకారమే కట్టుకునే వెసులుబాటు కల్పించింది.

Also Read: ఉక్కు ఉద్యమం నుంచి వైసీపీ తప్పుకున్నట్లేనా..? బంద్‌కు మద్దతు లేనట్లేనా..?

ముందుగా లబ్ధిదారులు ప్రభుత్వమే కట్టివ్వాలనే ఆప్షన్‌వైపు ఎక్కువగా మొగ్గు చూపడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకునే క్రమంలో సడలింపు నిర్ణయాన్ని తెరమీదకు తెచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వమే నిర్మించే వాటిని ప్రతిపాదత ఆకృతి ప్రకారమే చేపడుతామని అధికారులు చెప్పడంతో లబ్ధిదారులు ఒకటి, రెండు ఆప్షన్ల వైపు మల్లుతున్నారు. బహిరంగ మార్కెట్లో నిర్మాణ సామగ్రి, కూలీ ఖర్చులు పెరగడంతో పేదలు మొదట్లో మూడో ఆప్షన్‌కే ఎక్కువగా మొగ్గు చూపారు.

మొదటి 5 లక్షల మందిలో 60 శాతం మంది మూడో ఆప్షన్‌ను ఎంచుకున్నారు. అదేసమయంలో పలు జిల్లాల్లో ఇళ్ల డిజైన్‌పై పెద్ద ఎత్తున అభ్యంతరాలు వచ్చాయి. డిజైన్‌ మార్పునకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ ఇష్టప్రకారం కట్టుకోవాలని ఆప్షన్లు మార్చుకున్నారు. మరికొన్ని చోట్ల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు క్షేత్రస్థాయిలో అధికారులే లబ్ధిదారులపై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలూ ఉన్నాయి.

Also Read: విశాఖకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ షిఫ్ట్‌

కొన్ని లేఅవుట్లు లబ్ధిదారులు ప్రస్తుతం ఉంటున్న ప్రాంతానికి 20 నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అంతదూరం వెళ్లి ఇల్లు కట్టుకోవడం ఇబ్బందిగా భావించి ప్రభుత్వం కట్టించే ఇంటికే మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన 3.3 లక్షల ఆప్షన్లలో అత్యధికంగా దూరం వల్లే ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలను సాయంగా ఇస్తోంది. ఇంటి నిర్మాణంలో లబ్ధిదారులకు 3 ఆప్షన్లను ప్రకటించింది. అందులో ముఖ్యంగా ఇంటి నిర్మాణ సామగ్రిని ప్రభుత్వం సమకూరిస్తే లబ్ధిదారులే ఇల్లు కట్టుకోవడం.. లేదంటే ప్రభుత్వమే ఇల్లు కట్టివ్వడం లాంటి ఆప్షన్లు ఇచ్చారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్