https://oktelugu.com/

అలా చేస్తే రూ.75కే పెట్రోల్.. ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే..?

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గిస్తే బాగుంటుందని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎస్బీఐ ఆర్థికవేత్తలు పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ ధర ఏకంగా 75 రూపాయలకు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధీలోకి తీసుకురావడానికి సిద్ధంగా లేరని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. Also Read: వంటలకు ఏ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : March 4, 2021 / 02:38 PM IST
    Follow us on

    దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఊహించని స్థాయిలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్రం తగ్గిస్తే బాగుంటుందని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎస్బీఐ ఆర్థికవేత్తలు పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ ధర ఏకంగా 75 రూపాయలకు తగ్గుతుందని చెబుతున్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధీలోకి తీసుకురావడానికి సిద్ధంగా లేరని ఎస్బీఐ ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

    Also Read: వంటలకు ఏ నూనె వాడితే మంచిదో తెలుసా..?

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలియం ఉత్పత్తులపై విధిస్తున్న వ్యాట్, పన్నుల ద్వారానే భారీగా ఆదాయం చేకూరుతోందని ఈ కారణం వల్లే పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖంగా లేవని ఎస్బీఐ ఆర్థికవేత్తలు తెలిపారు. చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదని ఆర్థికవేత్తలు వెల్లడించారు. ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లక్ష కోట్ల రూపాయలు నష్టం వాటిల్లుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

    Also Read: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఆటోమేటిక్ గా ఫోటోలు డిలేట్..?

    దేశ జీడీపీలో ఈ నష్టం 0.4 శాతమని ఆర్థికవేత్తలు వెల్లడించారు. చమురు ధరలను స్థిరీకరించాలని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరల్లో మార్పులు చేయడం సరికాదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ధరలు పెరిగిన సమయంలో వచ్చే లోటును ధరలు తగ్గిన సమయంలో వచ్చే లాభాలను బట్టి పూడ్చుకోవాలని.. ఇలా చేస్తే వినియోగదారులపై భారం పడదని ఆర్థికవేత్తలు వెల్లడించారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ కు 8.50 రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని కేంద్రం సుంకాలను తగ్గిస్తే ఈ మేర తగ్గవచ్చని తెలుస్తోంది. మరి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుందో లేదో చూడాల్సి ఉంది.