రెడ్ మీ 10 ఫోన్స్ లాంచ్.. అద్భుత ఫీచర్లు.. వివరాలివే..!

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తూ రెడ్ మీ ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలతో పోలిస్తే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరంలో రెడ్ మీ సంస్థ రెడ్ మీ 10 సిరీస్ లో మూడు ఫోన్లను మన దేశ మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను తెస్తున్న రెడ్ మీ ఈ ఫోన్లను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం. రెడ్ […]

Written By: Kusuma Aggunna, Updated On : March 4, 2021 3:36 pm
Follow us on

తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తూ రెడ్ మీ ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలతో పోలిస్తే ఎక్కువ పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 సంవత్సరంలో రెడ్ మీ సంస్థ రెడ్ మీ 10 సిరీస్ లో మూడు ఫోన్లను మన దేశ మార్కెట్ లోకి అందుబాటులోకి తెచ్చింది. బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్లను తెస్తున్న రెడ్ మీ ఈ ఫోన్లను కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకురావడం గమనార్హం.

రెడ్ మీ 10 సిరీస్ లో లాంఛ్ కాబోతున్న ఈ ఫోన్లు అన్నీ ఆమోలెడ్ డిస్ప్లేతో తయారయ్యాయి. రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ పేర్లతో ఈ స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. రెడ్ మీ నోట్ 10 ఫోన్ ఈ నెల 16 నుంచి సేల్ కు రానుంది. రెడ్ మీ నోట్ 10 4జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ ధర 11,999 రూపాయలుగా ఉండగా 6జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమొరీ ఫోన్ ధర 13,999 రూపాయలుగా ఉంది.

Also Read: అలా చేస్తే రూ.75కే పెట్రోల్.. ఆర్థికవేత్తలు ఏం చెప్పారంటే..?

2 + 1 డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ తో రాబోతున్న ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతున్న ఈ ఫోన్ క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 678 జీ ప్రాసెసర్ తో రన్ అవుతుంది. 6.43 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లేను ఈ ఫోన్ కలిగి ఉంది. ఫోన్ వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉండగా ప్రైమరీ కెమెరా 48 మెగా పిక్సెల్, సెల్ఫీ కెమెరా 13 మెగా పిక్సెల్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది.

Also Read: వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్.. ఆటోమేటిక్ గా ఫోటోలు డిలేట్..?

రెడ్ మీ నోట్ 10 ప్రో ఫోన్లు ఈ నెల 1 నుంచి మార్కెట్ లోకి అందుబాటులోకి రాగా 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ వెర్షన్ మెమొరీ ధర 15,999 రూపాయలు, 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ వెర్షన్ మెమొరీ ధర 16,999 రూపాయలు , 8జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ డివైజ్ ధర 18,999 రూపాయలుగా ఉంది. 2+1 డెడికేటెడ్ మెమొరీ కార్డ్ స్లాట్ తో రాబోతున్న ఈ ఫోన్ 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడంతో పాటు 5,020 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 6.67 ఇంచ్ డిస్ ప్లేతో క్వాల్ కోమ్ 732 జీ ప్రాసెసర్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ లో నాలుగు కెమెరాలు ఉండగా ప్రైమరీ కెమెరా 64 మెగా పిక్సెల్ గా సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ గా ఉంది.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ ఫోన్ ఈ నెల 18వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్ 6 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ వెర్షన్ మెమొరీ ధర 18,999 రూపాయలు, 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ వెర్షన్ మెమొరీ ధర 19,999 రూపాయలు , 8జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ మెమొరీ డివైజ్ ధర 21,999 రూపాయలుగా ఉంది. క్వాల్ కోమ్ స్నాప్ డ్రాగన్ 732 ప్రాసెసర్ తో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ సూపర్ ఆమోలెడ్ డిస్ ప్లేతో ఈ ఫోన్ అందుబాటులోకి రానుండగా ఈ ఫోన్ లో ప్రైమరీ కెమెరా 108 మెగా పిక్సెల్ తో రానుండటం గమనార్హం. ఈ ఫోన్ లో సెల్ఫీ కెమెరా 16 మెగా పిక్సెల్ గా ఉంది.