Raghurama: నరసాపురం ఎంపీ, వైసీపీ రెబల్ రఘురామ కృష్ణంరాజు సంక్రాంతికి సొంతూరు వెళ్లాలని భావిస్తున్నారు. భీమవరంలో సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని చూస్తున్నారు. దీనికి గాను తన పర్యటనను ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలోనే పలు మార్లు రావాలని చూసినా కుదరలేదు. దీంతో ఈసారి రావాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు కానీ అధికార పార్టీ అరెస్టు చేయిస్తుందో ఏమోననే అనుమానాలు వస్తున్న సందర్భంలో రఘురామ తన సొంతూరు పర్యటన సాఫీగా సాగుతుందా లేదా అనే సంశయాలు వస్తున్నాయి.

ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఆయన పర్యటనను వీడియో తీయించుకునేందుకు సిద్ధమయ్యారు. ప్రతి కదలికను రికార్డు చేసేందుకు కెమెరామెన్లను పెట్టుకున్నారు. ఇంకా రహస్యంగా కూడా వీడియో తీయించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలోనే రఘురామ పర్యటన సందర్భంగా ఆయనను అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.
Also Read: ప్రజలకు జగన్ బ్యాంక్ లోన్లు.. త్వరపడండి
ఏ కారణం చేతనైనా అరెస్టు చేసేందుకు సర్కారు పన్నాగం పన్నుతుందనే నేపథ్యంలో ఏ చిన్న పొరపాటు లేకుండా చూసుకోవాలని రఘురామ చూస్తున్నారు. ఏదో ఒక చిన్న కారణం కూడా దొరకకుండా అప్రమత్తంగా ఉండేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో రఘురామ పర్యటనపై అందరిలో ఆసక్తి పెరుగుతోంది.
నరసాపురం వస్తే కేసులు పెట్టేందుకు అధికార పార్టీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రఘురామ తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు సమాచారం. ఎలాగైనా కేసు పెట్టేందుకు ప్లాన్ వేస్తున్నట్లు తెలుసుకుని రఘురామ కూడా తన వ్యూహాలు రెడీ చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉండేందుకే నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో రఘురామ భీమవరం వచ్చి మళ్లీ ఎలాంటి గొడవలు లేకుండా తిరిగి ఢిల్లీ వెళతారా? అనే సంశయాలు అందరిలో వస్తున్నాయి.
Also Read: చంద్రబాబు ‘ప్రేమ’ ఆఫర్‌పై పవన్ కల్యాణ్ సైలెంట్ వెనుక కారణం అదే?