CM KCR: ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలుగా మారుతున్నట్లుగానే ప్రస్తుతం రాజకీయాలు కూడా కార్పొరేటీకరణ అయ్యాయి. రాజకీయా పార్టీలు అలా మార్చేస్తున్నాయి. గెలుపుపై ధీమా లేకపోవడం, ఓటర్లను మేనేజ్ చేయడంలో విఫలం అవుతుండడంతో విధిలేని పరిస్థితిలో ప్రశాంత్‌కిశోర్, సునీల్ కనుగోలు లాంటి కార్పొరేట్ వ్యూహకర్తలను ఆశ్రయిస్తున్నారు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయకుండా.. కార్పొరేట్ సంస్థలపై ఆధారపడుతున్నారు.
రాజకీయాల్లో మర్పే కారణం..
రాజకీయాల్లో వేగంగా మార్పులు వస్తున్నాయి. పాత తరం నేతలు క్రమంగా కనుమరుగవుతున్నారు. దీంతో ప్రస్తుతం ఆర్థిక, అంగ బలం ఉన్నవారే రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి నేతలకు ప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలపై అవగాహన ఉండడం లేదు. దీంతో కార్పొరేట్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఆర్టిఫీషియన్ వ్యూహాలు రూపొందించుకుని ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. దీంతో కార్పొరేట్ సంస్థలు కూడా వచ్చిన అవకాశాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. సర్వేలు, పోల్ మేనేజ్‌మెంట్, బలాలు, బలహీనతల సర్వే పేరుతో పార్టీల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు.
ప్రస్తుతం కూడా వ్యూహకర్తలే..
ఇప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కు సునీల్ కనుగోలు, ఏపీలో వైసీపీకి ప్రశాంత్‌కిశోర్ పనిచేస్తున్నారు. సునీల్ ప్రశాంత్ కిశోర్ శిష్యుడే. టీడీపీకి ప్రశాంత్‌కిశోర్ మిత్రుడు రాబిన్‌శర్మ పనిచేస్తున్నారు. వీరంతా చేసేంది ఏమిటంటే తాత్కాలిక వ్యూహాలే. ఎన్నికల్లో పార్టీని గెలిపించడం వరకు నేతలను నటించేలా డైరెక్షన్ చేస్తున్నారు. చేతులు, కాళ్లు విరగొట్టుకోవడం, సానుభూతి ఓట్లు పొందేలా చేయడం, సెంటిమెంటు రగిలచ్చడం తదితర వ్యూహాలతో పార్టీలకు మైలేజ్ తెస్తున్నారు.
ఒంటరిగా కేసీఆర్..
ఇక ప్రస్తుతం కేసీఆర్ ఒంటరిగా ఎన్నికల బరిలో దిగారు. వ్యూహాల్లో నిష్ణాతుడైన కేసీఆర్ తన సొంత ఆలోచనలతోనే బీఆర్‌ఎస్‌ను నడిపిస్తున్నారు. ఏడాది క్రితం ప్రశాంత్ కిశోర్‌తో పనిచేసినా.. తర్వాత తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ అన్నీ తానై పార్టీని ఎన్నికల్లో నడిపిస్తున్నారు. ఆయనకు కేటీఆర్, హరీశ్‌రావు సహకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈ ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ ఎన్నికల తర్వాత కార్పొరేట్ సంస్థలకు చెక్ పడడం ఖాయం అంటున్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలు, వ్యూహాలతో పనిచేసే నేతలే గెలుస్తారని తేలిపోతుంది. తాత్కాలిక వ్యూహాలు పనిచేయవని నిర్ధారణ అవుతుంది. దీంతో కార్పొరేట్ రాజకీయాలకు చెక్ పడుతుంది.