జగన్ అవి సాధిస్తే.. ఇక తిరుగుండదు?

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయడం లేదు. వాటి పూర్తికే కంకణం కట్టుకున్నారు. ప్రజల మన్ననలు పొందేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. మరోసారి అధికార పీఠం చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పనుల్లో పెండింగ్ లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యమైన పనులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే పోలవరం ప్రాజెక్టును 2022 కల్లా పూర్తి చేయాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. బీడు భూములకు నీళ్లిచ్చి ఓట్లు […]

Written By: Srinivas, Updated On : June 19, 2021 11:31 am
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ దూసుకుపోతున్నారు. అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయడం లేదు. వాటి పూర్తికే కంకణం కట్టుకున్నారు. ప్రజల మన్ననలు పొందేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. మరోసారి అధికార పీఠం చేజిక్కించుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా పనుల్లో పెండింగ్ లేకుండా చూసుకుంటున్నారు. ముఖ్యమైన పనులు శరవేగంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసమే పోలవరం ప్రాజెక్టును 2022 కల్లా పూర్తి చేయాలని అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. బీడు భూములకు నీళ్లిచ్చి ఓట్లు అడగాలనుకుంటున్నారు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు మరోలా ఆలోచించారు. పనులు పూర్తయితే ప్రజలు మరిచిపోతారని భావించారు. అందుకే ముఖ్యమైన పనులు పెండింగులో పెట్టారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి పనులు చేయకుండా ఆపేసి నన్ను గెలిపిస్తే పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ ప్రజలు విశ్వసించలేదు.ఫలితంగా ఓటమి పాలయ్యారు. అందుకే జగన్ పనుల పూర్తికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ కు పోలవరం ప్రాజెక్టు జీవనాడి. ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్ కు ప్రజల్లో మంచి పేరు వస్తుంది. తన తండ్రి వైఎస్ ప్రారంభించిన ప్రాజెక్టును పూర్తి చేశాడన్న ఖ్యాతి దక్కుతుంది. అందుకే ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తయ్యేలా జగన్ శ్రద్ధ చూపిస్తున్నారు. నిధుల కోసం తరుచూ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు.2022 చివరి నాటికి నీళ్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నారు.

మూడు రాజధానుల నిర్మాణం కూడా త్వరగా పూర్తి చేయాలని జగన్ భావిస్తున్నారు. విశాఖలో పాలనా రాజధాని, కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటయితే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. అందుకే త్వరితగతిన కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని తన ఢిల్లీ పర్యటనలో కేంద్రాన్ని కోరారు. విశాఖలో తాను నేరుగా పాలన సాగించే వీలుంది. న్యాయ రాజధాని కోసం కేంద్ర ప్రభుత్వం రీ నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. ఇందుకోసం జగన్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. జగన్ ఇచ్చిన హామీలను పూర్తి చేసి ప్రజల్లోకి వెళ్లాలని ఆలోచిస్తున్నారు.