IT Raids: తెలంగాణ లో ఐటీ దాడులు చేస్తే.. ఏపీలో ఎందుకు ప్రకంపనలు?

ఎన్నికల సమయంలో ఐటి దాడులు సర్వసాధారణమైనప్పటికీ హైదరాబాదులోని రెండు కంపెనీల మీద.. దాడులు జరగడం, భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి.

Written By: Chai Muchhata, Updated On : October 25, 2023 10:19 am

IT Raids

Follow us on

IT Raids: తెలంగాణలో అతి త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఎన్నికల సంఘం అధికారులు, స్థానిక పోలీసులతో కలిసి తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో భారీగా నగదు, బంగారం, వెండి పట్టుబడుతున్నాయి. అయితే ఇటీవల హైదరాబాద్ లోనే మియాపూర్ ప్రాంతంలో భారీగా నగదు లభ్యం కావడం, నల్లగొండ జిల్లాలోని తనిఖీ కేంద్రంలో కూడా భారీగా నగదు పట్టు పడటంతో పోలీసులు దీని గురించి లోతుగా దర్యాప్తు చేశారు. అయితే వారికి ఏదో అనుమానాస్పదంగా కనిపించడంతో ఐటీ అధికారులకు సమాచారం అందించారు. పోలీసులు అందించిన సమాచారం ఆధారంగా ఐటి అధికారులు లోతుగా దర్యాప్తు జరిగితే డొంకంతా కదిలింది. సీన్ కట్ చేస్తే హైదరాబాదులో రెండు కంపెనీలపై ఐటి దాడులు జరిగాయి.

ఎన్నికల సమయంలో ఐటి దాడులు సర్వసాధారణమైనప్పటికీ హైదరాబాదులోని రెండు కంపెనీల మీద.. దాడులు జరగడం, భారీగా నగదు స్వాధీనం చేసుకోవడం వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఏఎమ్ ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీలో జరిగిన సోదాల్లో ఒక రాజకీయ పార్టీకి ఇచ్చేందుకు ఏకంగా 150 కోట్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ సంస్థ యజమాని ఒక రాజకీయ పార్టీ నేతకు అత్యంత సన్నిహితుడు. ఆయన సిఫారసు మేరకే ఏ ఎమ్ ఆర్ కన్స్ట్రక్షన్ యజమాని 150 కోట్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇదే సంస్థ నుంచి కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఒక రాజకీయ పార్టీకి ఆర్థిక సహాయం అందింది. అప్పట్లో ఐటీ అధికారులు ఈ కంపెనీ మీద పెద్దగా దృష్టి సారించలేదు.. అయితే ఇప్పుడు మాత్రం ఈ విషయాన్ని పసిగట్టి తెలంగాణలో ఎన్నికలకు సిద్ధం చేసిన డబ్బును పట్టుకున్నారు. ఇది ఏ పార్టీకి ఇస్తారు అనే విషయాన్ని మాత్రం ఐడి అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు.

ఈ ఐటి దాడులు జరిగిన కంపెనీలో ఏపీలోని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యాపారులవి. మీరు ఏపీలోని అధికార పార్టీకి చెందిన కీలకమైన వ్యక్తులకు అత్యంత సన్నిహితులు. ఈ ఐటీ దాడులు జరిగిన కంపెనీలో ఒక కంపెనీ పూర్తిగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు వాడుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. సదరు కంపెనీకి గుర్తుతెలియని వ్యక్తుల ద్వారా డబ్బు రావడం.. ఆ డబ్బు తాము ఇవ్వాలి అనుకున్న రాజకీయ పార్టీలకు ఈ కంపెనీ సర్దుబాటు చేయడం అనేది జరుగుతుంది. అయితే తన కంపెనీని నగదు మార్పిడి కేంద్రంగా మార్చిన యజమాని.. ఏపీలో ఒక కీలక పదవిలో ఉన్నట్టు తెలుస్తోంది. సదరు వ్యక్తి ఈ పనినైనా డబ్బుతోనే పూర్తి చేయాలి అనే ధోరణితో ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఏపీలో షర్మిల రాజకీయం చేయకుండా ఉండేందుకు ఈ వ్యక్తి అడ్డుకున్నారని తెలుస్తోంది. అంతే కాదు తెలంగాణ ప్రాంతంలో షర్మిల రాజకీయ పార్టీ పెట్టి, సభలు నిర్వహించేందుకు ఈ వ్యక్తి ఆర్థిక సహాయం చేశాడని తెలుస్తోంది.

తాజాగా జరిగిన దాడుల్లో భారీగా నగద లభ్యం కావడంతో కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఇదే స్థాయిలో ఈ కంపెనీల యజమాని ఏపీ ఎన్నికల్లోను ఒక రాజకీయ పార్టీకి సరఫరా చేసేందుకు భారీ ఎత్తున నగదు సిద్ధం చేశారని తెలుస్తోంది. అయితే ఆ నగదును ఈ ప్రాంతంలో కాకుండా తెలంగాణలోనే ఒక సురక్షితమైన ఏరియాలో జాగ్రత్తగా ఉంచినట్టు సమాచారం. ఆ డబ్బు గురించి ఐటీ అధికారులకు తెలిసిపోయిందేమోనని అధికార పార్టీ నాయకులు మదన పడుతున్నారు. ఒకవేళ ఐటీ అధికారులకు ఆ డంప్ చేసిన నగదు గురించి సమాచారం తెలిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని ఏపీలోని ఒక పార్టీ నాయకులు భయపడుతున్నారు. మరి ఐటీ అధికారులు ఆ డబ్బు డంప్ పై దాడులు చేస్తారా? ఏ రాజకీయ పార్టీల కోసం ఈ నగదు దాచారో చెబుతారా? అనేవి ఇప్పుడు సమాధానాలు లభించాల్సిన ప్రశ్నలు.