కృష్ణపట్నం ఆయుర్వేద మందు సంగతి ఏం కానుంది?

కరోనా వైరస్ సోకిన వారికి అందించే ఆయుర్వేద మందు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మందుపై పెద్ద దుమారమే రేగుతోంది. దీని పనితీరుపై ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కల్పించుకుని పరిశీలించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఆయుర్వేద మందు ప్రభావంపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని ఏం నిర్ణయిస్తారో తెలియాలి. శుక్రవారం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. జనం రద్దీ దృష్ట్యా గంటల వ్యవధిలోనే ఆపాల్సి వచ్చింది. వేలాదిగ […]

Written By: Srinivas, Updated On : May 22, 2021 11:58 am
Follow us on

కరోనా వైరస్ సోకిన వారికి అందించే ఆయుర్వేద మందు గురించి అందరూ చర్చించుకుంటున్నారు. ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ మందుపై పెద్ద దుమారమే రేగుతోంది. దీని పనితీరుపై ఇప్పటికే కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు కల్పించుకుని పరిశీలించేందుకు ముందుకు వచ్చాయి. దీంతో ఆయుర్వేద మందు ప్రభావంపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని ఏం నిర్ణయిస్తారో తెలియాలి. శుక్రవారం కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు పంపిణీ చేశారు. జనం రద్దీ దృష్ట్యా గంటల వ్యవధిలోనే ఆపాల్సి వచ్చింది. వేలాదిగ వచ్చిన జనం మీద పడడంతో రక్షణ కోసం మధ్యలోనే ఆపేశారు. భౌతిక దూరం పాటించకపోవడంతో సమస్య ఎదురైంది. పరిస్థితి చేయిదాటి పోతుందని భావించి అధికారులు సైతం ఏమి చేయలేకపోయారు. దీంతో నిర్వాహకులు మందు పంపిణీ వాయిదా వేశారు.

స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ెడ్డి ఆయుర్వేద మందు పంపిణీపై మాట్టాడారు. మందు తయారీకి విరామం కావాలని, మూలికలు సేకరించి మందు తయారు చేయడానికి సమయం పడుతుందని చెప్పారు. అప్పటి వరకు జనం ఆగాలని పేర్కొన్నారు. అవసరమైతే ఆన్ లైన్ లో మందు పంపిణీ చేస్తామని, రాష్ర్టంలోని అన్ని ప్రాంతాల్లో కౌంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆయుర్వేద మందు కోసం ప్రజలు ఎగబడడంతో దారులన్నీ జనంతో నిండిపోయాయి. దీంతో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనాల రద్దీతో ప్రజలు బయటకు వెళ్లడానికి కూడా ఆటంకాలు పడ్డారు.

ఆనందయ్యను అరెస్టు చేశారంటూ శుక్రవారం సాయంత్రం పుకార్లు పుట్టుకొచ్చాయి. నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆయుర్వేద మందు పనితీరును పరిశీలించేందుకు ఆనందయ్యను పోలీసులు నెల్లూరుకు తరలించారు. ఆయనను అరెస్టు చేశారంటూ ఊహాగానాలు రావడంతో జిల్లా ఎస్పీ, ఎమ్మెల్యేలు కల్పించుకోవాల్సి వచ్చింది. పోలీసులు రక్షణ మాత్రమే కల్పించామని వివరణ ఇచ్చారు. దీంతో పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఆయుర్వేద మందు ప్రభావం గురించి ప్రజల్లో నెలకొన్న విశ్వాసంపై అధ్యయనం చేశారు.మొత్తానికి ఏం తేలిందే తెలియాల్సి ఉంది.

రాష్ర్ట ప్రభుత్వం నియమించిన ఆయుర్వేద నిపుణుల కమిటీ ఏం తేల్చనుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఐసీఎంఆర్, రాష్ర్ట ప్రభుత్వం నియమించిన కమిటీ రెండూ సంయుక్తంగా ఆయుర్వేద మందు సామర్థ్యాన్ని అంచనా వేస్తున్నాయి. మందు ఏ మేరకు రోగులపై ప్రభావం చూపుతుంది? రోగం నయం కానుందా? అంటూ డాక్టర్లు, ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకుంటున్నారు. దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేవని, వాడిన వారిలో మంచి ఫలితాలు వస్తున్నాయని తెలిసింది. సోమవారం మరో బృందం కృష్ణపట్నం వెళ్లనుందని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంకా రెండు మూడు రోజుల పాటు ఆయుర్వేద మందు పంపిణీ తిరిగి ప్రారంభం కాదని తెలుస్తోంది. కమిటీల నివేదిక తర్వాత ప్రభుత్వం నిర్ణయం మేరకు మందు పంపిణీ జరుగుతుందని తేల్చారు.