Homeజాతీయ వార్తలుIBomma Ravi Tamil Nadu Elections 2026: బెట్టింగ్ లాగానే.. తమిళనాట గెలుపును డిసైడ్ చేసిన...

IBomma Ravi Tamil Nadu Elections 2026: బెట్టింగ్ లాగానే.. తమిళనాట గెలుపును డిసైడ్ చేసిన ఐబొమ్మ రవి

IBomma Ravi Tamil Nadu Elections 2026: సినిమాల పైరసీ.. వాటిని తన వెబ్సైట్లో అప్లోడ్ చేయడం.. దానిద్వారా అక్రమంగా డబ్బు సంపాదించడం వంటి వాటిని అలవాటుగా మార్చుకున్న ఐ బొమ్మ రవి.. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తాడు. తెలంగాణ పోలీసులు పట్టుకోవడం.. తమదైన స్టైల్ లో ట్రీట్మెంట్ ఇవ్వడంతో అతడు తన ధోరణి మార్చుకున్నాడు. 100 జింకలను తిన్న పులి శాంతి కపోతంగా మారినట్టు.. అక్రమ వ్యాపారానికి.. దందాలకు అలవాటు పడి.. చివరికి పోలీసులకు చిక్కిన రవి.. ఇప్పుడు పొలిటికల్ ఎనలిస్టుగా మారిపోయాడు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పట్ల యావత్ దేశం మొత్తం ఆసక్తిగా ఉంది. ఎందుకంటే డిఎంకె కాంగ్రెస్, అన్న డీఎంకే బీజేపీ, టీవీకే పార్టీలు ఇక్కడ పోటీలో ఉన్నాయి. అధికారాన్ని దక్కించుకుంటామని డిఎంకె.. ఈసారి మార్పు స్పష్టంగా ఉంటుందని అన్న డిఎంకె.. ప్రజలు కొత్త తరహా రాజకీయాలను చూస్తారని టీవీ కే నేతలు చెబుతున్నారు. పోలింగ్ ఇంకా అక్కడ కొనసాగుతూనే ఉంది. రికార్డు స్థాయిలో 89 శాతాన్ని మించి అక్కడ పోలింగ్ నమోదు అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంకా చాలామంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. సాయంత్రం ఐదు గంటల వరకే పోలింగ్ సమయం ముగియడంతో.. ఆ సమయం నాటికి పోలింగ్ కేంద్రంలో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని పోలీసులు ఇస్తున్నారు.

పోలింగ్ నేపథ్యంలో రవి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశాడు. దాని ప్రకారం తమిళనాడు రాష్ట్రా ఎన్నికల్లో అధికార డిఎంకె మరోసారి అధికారాన్ని దక్కించుకునే అవకాశం ఉందట. విజయ్ పార్టీకి 15 నుంచి 20 వరకు ఓటింగ్ లభిస్తుందట. జన నాయకుడు సినిమా విడుదల కాకముందే లీక్ అయింది. దీంతో తమిళ ప్రజల్లో విజయ్ పట్ల సింపతి పెరిగింది. అది కాస్త టీవీకే పార్టీకి ప్లస్ అయిందని రవి భావిస్తున్నాడు.. అతడు చేసిన ఈ ట్వీట్.. సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. మొన్నటిదాకా పైరసీ వ్యాపారం చేశావు.. ఇప్పుడేమో పొలిటికల్ గా మారిపోయావా.. ఏమైనాప్పటికీ నీ విశ్లేషణ వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉందని కొంతమంది అంటుంటే.. మిగతావారేమో ప్రశాంత్ కిషోర్ లాగా నువ్వు కూడా ఒక సంస్థను ఏర్పాటు చేసి.. కోట్లు సంపాదించుకో అంటూ మరి కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version