కరోనా పేషంట్లకు మిస్ ఇంగ్లండ్ ట్రీట్మెంట్

కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా కరోనానే. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరి ధాటికి అగ్రరాజ్యాలు సైతం చేతులేత్తిసున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక బ్రిటన్లో ప్రధాని బోరిస్ కే కు కరోనా సోకిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 5:47 pm
Follow us on


కరోనా.. కరోనా.. కరోనా.. ఎక్కడ చూసినా కరోనానే. ఈ పేరు వింటనే ప్రపంచ దేశాలు బెంబెలెత్తిపోతున్నాయి. చైనాలోని వూహాన్లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచంలోని అన్నిదేశాలకు పాకింది. కరోనా మహమ్మరి ధాటికి అగ్రరాజ్యాలు సైతం చేతులేత్తిసున్నాయి. అమెరికా, ఇటలీ, బ్రిటన్, స్పెయిన్ దేశాల్లో కరోనా విలయతాండవం చేస్తుంది. ఈ దేశాల్లో కరోనా మృతుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఇక బ్రిటన్లో ప్రధాని బోరిస్ కే కు కరోనా సోకిందంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

బ్రిటన్లో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. దీంతో వైద్యుల కొరత ఏర్పడింది. ఈనేపథ్యంలో కరోనా బాధితులకు వైద్య సేవలందించేందుకు మిస్ ఇంగ్లండ్ ముందుకొచ్చి మానవత్వాన్ని చాటుకుంది. మిస్ ఇంగ్లండ్ కిరీటాన్ని గెలుపొందిన భాషా ముఖర్జీ తన మోడలింగ్ ను కూడా పక్కన పెట్టి డాక్టర్ అవతారమెత్తారు. దేశంలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ఆమె మళ్లీ వైద్య వృత్తిలోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆమె శ్వాసకోశ వైద్యంలో ఎంఎస్ చేశారు. అయితే మోడలింగ్ రంగంపై ఆసక్తితో వైద్య వృత్తి వదిలి మిస్ ఇంగ్లండ్ గా కిరీటం గెలిచింది.

భాషా ముఖర్జీ ప్రవాస భారతీయురాలు కావడం విశేషం. 2019లో జూనియర్ వైద్య వృత్తినుంచి విరామం తీసుకున్నారు. తాజాగా బ్రిటన్లో పరిస్థితి దిగజారడంతో డాక్టర్ గా విధులు నిర్వహిస్తూ కరోనా బాధితులకు వైద్యం అందిస్తోంది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు తన సేవలను దేశానికి అందించడం గర్వంగా ఉందని ఆమె చెబుతోంది. మిస్ ఇంగ్లండ్ కీరిటాన్ని గెలుపొందిన భాషా ముఖర్జీ వైద్యురాలిగా సేవలందిస్తుండటంతో ఆమెపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.