Pawan Hyper Adi : ఇండస్ట్రీ లో ఉన్న ఎంతోమంది హీరోలు మరియు క్యారక్టర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ పేరు వాడుకొని డబ్బులు సంపాదించుకోవడమే ఇదివరకు మనం చూస్తూ వచ్చాము..సోల్ మేట్స్ అంటూ తనవెంట తిరిగిన ఆప్తులు కూడా ఎన్నికల సమయం లో వెన్నుపోటు పొడిచి వైసీపీ పార్టీ లో చేరి పవన్ కళ్యాణ్ పై నోటికి వచినట్టు మాట్లాడిన వాళ్ళని చూసాము..మెగా ఫ్యామిలీ లో ఒక్క నాగబాబు మినహా ఏ ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్టుగా రాజకీయాలపై స్పందించడానికి సాహసం చెయ్యరు.

ఎందుకంటే సపోర్టు చేస్తే ఎక్కడ ఇండస్ట్రీ లో తమ సినిమాలకు లేనిపోనీ అడ్డంకులు పెడుతారో అనే భయం..కేవలం మెగా ఫ్యామిలీ లో మాత్రమే కాదు..ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది ఆర్టిస్టులకు పవన్ కళ్యాణ్ అంటే విపరీతమైన అభిమానం ఉన్నప్పటికీ ప్రభుత్వం నుండి ఎప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎదురుకోవాలో అని భయపడి రియాక్ట్ అవ్వడానికి సాహసించరు.
కానీ నేడు జనసేన పార్టీ శ్రీకాకుళం లో రణస్థలం ప్రాంతం లో నిర్వహించిన ‘యువశక్తి’ అనే భారీ బహిరంగ సభలో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది చూపించిన తెగువని చూసి పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు..ముఖ్యంగా రీసెంట్ గా రోజా చేసిన కామెంట్స్ కి కూడా హైపర్ ఆది చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు..ఆయన మాట్లాడుతూ ‘మాటికొస్తే పవన్ కళ్యాణ్ గారిని ప్యాకేజి స్టార్ అని అంటూ ఉంటారు..పవన్ కళ్యాణ్ అనేటోడు ప్రేమకి లొంగుతాడు కానీ, డబ్బులకు కాదు నీ *’ అంటూ బూతులు మింగేస్తాడు హైపర్ ఆది.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఇంకోటి ఏంటి దత్తపుత్రుడు..దత్తపుత్రుడు..ఏ నోటితో అయితే మీరు దత్తపుత్రుడు అని అన్నారో..అదే నోటితో అంజనీ పుత్రుడు అని అనిపించుకోకపోతే..త్వరలోనే మీరు చూస్తారు..ప్రపంచం లో ప్రతీ ఒక్కడు పవన్ కళ్యాణ్ గారిని ఎదో ఒకటి అనేసి పాపులర్ అయిపోవాలని చూస్తారు..మీ పాపులారిటీ కోసం ఆయన పర్సనాలిటీ దెబ్బతినేలా కామెంట్స్ ఇంకోసారి చేసారంటే ఈసారి జనసేన కొట్టే దెబ్బకు మీ అబ్బ గుర్తుకువస్తాడు చూసుకోండి’ అంటూ హైపర్ ఆది చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో సెన్సేషనల్ గా మారింది.
