Meenakshi Chowdhury: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోయిన్స్ లో ఒకరు మీనాక్షి చౌదరి(Meenakshi Chaudary). ప్రస్తుతం ఈమెకు యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ సాధారణమైనది కాదు. కుర్రాళ్లకు చూసేందుకు భార్య మెటీరియల్ లాగా అనిపిస్తుంది, అదే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి మన ఇంట్లోని అమ్మాయి లాగా అనిపిస్తుంది. అందుకే మీనాక్షి చౌదరి కి కెరీర్ లో పెద్దగా సూపర్ హిట్స్ లేకపోయినా, సినిమాల్లో అలా వరుసగా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఈమె నటించిన సినిమాల్లో ఇప్పటి వరకు కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యినవి లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే. ఈ రెండు మినహా ఆమె కెరీర్ లో పెద్దగా విజయాలు లేవు, కానీ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా హీరోయిన్ గా కొనసాగుతోంది.
ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఈమె ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. సీనియర్ హీరోలతో కలిసి నటించడానికి మీరు సిద్దమేనా అని అడగా, దానికి ఆమెకు సమాధానం చెప్తూ ‘నేను ఒక నటిని. ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా నేను సిద్ధం. కుర్ర హీరోలతో కలిసి నటించాలని రూల్ నేను పెట్టుకోలేదు. 70 ఏళ్ళ వయస్సు ఉన్న హీరో పక్కన నటించడానికి కూడా నేను రెడీ. కానీ ఇద్దరు పిల్లలకు తల్లి గా మాత్రం నేను నటించను. లక్కీ భాస్కర్ చిత్రం లో పరిస్థితుల కారణంగా ఇష్టం లేకపోయినా ఇద్దరు పిల్లలకు తల్లి పాత్ర పోషించాల్సి వచ్చింది. ఆ సినిమా అదృష్టం కొద్దీ పెద్ద హిట్ అయ్యి నాకు నటిగా కూడా మంచి పేరు తీసుకొచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి.
ఇది ఇలా ఉండగా మీనాక్షి చౌదరి ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి మిస్టిక్ థ్రిల్లర్ జానర్ లో ఒక సినిమా చేస్తోంది. విరూపాక్ష ఫేమ్ కార్తీక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతలోపే ఆమె నవీన్ పోలిశెట్టి హీరో గా నటిస్తున్న ‘అనగనగ ఒక రాజు’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. దాదాపుగా షూటింగ్ కార్యక్రమాలను మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సినిమాలతో పాటు, మరో నాలుగు తెలుగు సినిమాల్లో నటించడానికి సంతకాలు చేసింది మీనాక్షి చౌదరి. త్వరలోనే ఈ సినిమాలు సెట్స్ మీదకు వెళ్లనున్నాయి.