Hyderabad Students: హైదరాబాదీలు అంటే ఆశామాషీ కాదు.. కటౌటే కాదు.. కంటెంటూ ఎక్కువే. ఏ మిషయంలో అయినా తగ్గేదే అంటారు. తాజాగా స్టూడెంట్స్ ఆత్మవిశ్వాసం స్థాయిలపై చేసిన ఒక సర్వేలో హైదరాబాదీలదే అగ్రస్థానం. దేశంలోని మెట్రో నగరాల మొత్తం సగటుతో పోల్చినప్పుడు హైదరాబాద్ పోరగాండ్లలోనే ∙కాన్ఫిడెన్స్ ఎక్కువని తేలింది.

సాధారణంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక విషయాలపై వివిధ సంస్థలు సర్వేలు చేస్తుంటాయి. క్షేత్ర స్థాయిలో రియాలిటీ తెలుసుకోవడానికి సర్వేలు ఉపయోగపడతాయి. అలాగే స్కూల్ విద్యార్థులకు సంబంధించిన సర్వే ఒకటి ఇటీవల విడుదలైంది. స్టూడెంట్స్ ఆత్మవిశ్వాసం స్థాయిలపై చేసిన ఈ సర్వేలో ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. దేశంలోని మెట్రో నగరాల మొత్తం సగటుతో పోల్చినప్పుడు హైదరాబాద్‌కు చెందిన విద్యార్థుల కాన్ఫిడెన్స్ ఇండెక్స్ గణనీయంగా ఎక్కువగా ఉందని తేలింది. విద్యార్థుల కాన్ఫిడెన్స్ జాతీయ సగటు 75 కాగా, హైదరాబాద్ విద్యార్థుల కాన్ఫిడెన్స్ ఇండెక్స్ 87 పాయింట్లుగా ఉంది.
స్కూల్ స్టూడెంట్స్‌పై సర్వే..
ప్రముఖ స్కూల్ ఎడ్‌టెక్ కంపెనీ ‘లీడ్’.. స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ పేరుతో ఓ సర్వే చేపట్టింది. దేశంలోని వివిధ ప్రాంతాలు, నగరాలు, జనాభాతోపాటు ఇతర పారామీటర్స్ ఆధారంగా స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్‌ను ఈ సర్వే అంచనా వేసింది. ముఖ్యంగా కాన్సెప్చువల్ అండర్‌స్టాడింగ్, క్రిటికల్ థింకింగ్, కమ్యూనికేషన్, కొలాబ్రేషన్, ఎక్స్‌పోజర్ టూ ఆపర్చునిటీస్ అండ్ ప్లా్లట్‌ఫామ్స్ వంటి అంశాల్లో విద్యార్థుల ఎబిలిటీ ఆధారంగా ఈ సర్వే ఫలితాలను ప్రకటించింది.
ముంబై, చెన్నైలో అమ్మాయిల్లో అధికం..
విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్‌లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉండగా, ముంబై 78 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చెన్నై, ముంబై మినహా మిగతా మెట్రో నగరాల్లో బాలురు, బాలికలు ఈక్వల్ కాన్ఫిడెంట్‌తో ఉన్నారు. చెన్నై, ముంబై నగరాల్లో మాత్రం బాలురు కంటే బాలికల్లో కొద్దిగా కాన్ఫిడెన్స్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని సర్వే పేర్కొంది. మెట్రో నగరాల్లో 6 – 8 తరగతుల విద్యార్థులతో పోల్చినప్పుడు 9–10 తరగతుల విద్యార్థుల కాన్ఫిడెంట్ ఎక్కువగా ఉంది.
సీబీఎస్‌ఈ స్టూడెంట్స్ సూపర్..
రీజనల్ లెవల్‌లో విద్యార్థుల కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌లో పశ్చిమ భారతం 81 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, దక్షిణ, తూర్పు భారతం జాతీయ సగటుకు సమీపంలో ఉన్నాయి. స్టేట్ బోర్డ్‌లకు అనుబంధంగా ఉన్న పాఠశాలల్లోని విద్యార్థులతో పోలిస్తే సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ(ఐఇ ఉ) పాఠశాలల్లోని విద్యార్థులలో కాన్ఫిడెన్స్ ఇండెక్స్ స్వల్పంగా ఎక్కువగా ఉంది. ఢిల్లీలో మాత్రం ఇందుకు విరుద్ధంగా ఉంది. అక్కడ స్టేట్ బోర్డ్ విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కొంచెం ఎక్కువగా ఉంది.

నాన్ మెట్రోస్‌లో సూరత్ నంబర్ 1
నాన్ మెట్రో నగరాల్లోని విద్యార్థుల కంటే, మెట్రోల్లోని విద్యార్థులకు అవకాశాల్లో క్లియర్ అడ్వాంటేజ్ ఉందని సర్వే పేర్కొంది. కాన్పిడెంట్ ఇండెక్స్ స్కోర్‌లో హైదరాబాద్ 87 పాయింట్ల వద్ద ఉంటే, నాన్ మెట్రో సిటీ అయిన అంబాలా 62 పాయింట్ల వద్ద ఉంది. ఈ రెండు నగరాల మధ్య దాదాపు 25 పాయింట్ల గ్యాప్ ఉంది. ఇక, నాన్ మెట్రో నగరాల్లో సూరత్ నంబర్ 1 స్థానంలో ఉంది.
ఆత్మనిర్భర్ భారత్‌గా..
ప్రముఖ సర్వే సస్థ లీడ్ సహ వ్యవస్థాపకుడు సుమీత్ మెహతా మాట్లాడుతూ.. ‘‘భారతదేశం ఆత్మనిర్భర్‌గా ఎదగాలంటే, విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఉండాలి’’ అన్నారు. అయితే మన దేశంలో విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్ తెలుసుకునే మార్గం లేదు. దీంతో టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ భాగస్వామ్యంతో లీడ్ సంస్థ స్టూడెంట్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్‌ను తీసుకొచ్చింది. ఇది వార్షిక సర్వే. విద్యార్థుల కాన్ఫిడెన్స్ లెవల్స్ పర్యవేక్షించడంలో ఈ సర్వే దోహదపడుతుంది అని చెప్పారు.