Hyderabad Gang Rape Case: జూబ్లీహిల్స్ రేప్ కేసు చిక్కుముడి వీడుతోంది. ఇందులో ప్రజాప్రతినిధుల కొడుకులు, మనవళ్లు ప్రధాన సూత్రధారులుగా ఉండటం గమనార్హం. అందుకే కేసును పక్కదారి పట్టించేందుకు ఇంత ఆలస్యం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలకు చెందిన వారసులే ఈ ఘాతుకానికి తెగబడటం సంచలనం కలిగించింది. నగరం నడిబొడ్డులో బాలికపై అత్యాచారం చేయడం మహిళా లోకాన్ని సైతం నివ్వెరపరుస్తోంది. అధికారముంటే చాలు ఏమైనా చేయొచ్చనే ఉద్దేశంతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నా అధికార పక్షం మాత్రం పెదవి విప్పడం లేదు. దీంతో ఇది టీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగానే పరిణమిస్తోంది.

మొదట బాలకను పబ్ లో కార్పొరేటర్ కుమారుడు అసభ్యంగా ప్రవర్తించి ఆమెను ట్రాప్ చేసి కారులో ఎక్కించి ఒకరి తరువాత ఒకరు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. దీంతో ఏం చేయలేని స్థితిలో బాలికపై అఘాయిత్యానికి తెగబడటంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. వారందరిని రిమాండ్ కు తరలించారు. నేరం అంగీకరించడంతో వారికి శిక్షలు పడటం ఖాయమే. కానీ బాలిక భవిష్యత్ ను నాశనం చేసిన వారిని ఎన్ కౌటర్ చేయాలనే డిమాండ్ కూడావస్తోంది. గతంలో దిశపై దాడి చేసిన వారిని చేసినట్లే వీరిని కూడా కాల్చి పారేయాలని మహిళలు నినదిస్తున్నారు.
Also Read: Nayanthara Wedding Saree: నయనతార పెళ్లిలో ధరించింది మన గద్వాల చీరనే.. ధర ఎంతో తెలుసా?
ఈ కేసులో మాజీ ఎమ్మెల్యే మనవడు, ప్రస్తుత ఎమ్మెల్యే కొడుకు ఉండటం గమనార్హం. ఇందులో ఎమ్మెల్యే కొడుకు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. బాలికను కారులో ఎక్కించిన తరువాత షాబుద్దీన్ వెనుక సీట్లో బాలికపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఆ తరువాత వరుసగా అందరం వెళ్లాం అని వెల్లడించాడు. దీంతో వారిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. సంచలనం సృష్టించిన బాలిక లైంగిక దాడి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.

మరోవైపు ఇందులో ఐదుగురు మైనర్లు ఉండటం గమనార్హం. వారందరిని జువైనల్ హోం కు తరలించారు. పోలీసులు జువైనల్ కోర్టుకు వారిని కస్టడీకి అప్పగించాలని కోరడంతో కోర్టు అందుకు ఒప్పుకుంది. మైనర్లను కూడా విచారించేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో నాలుగు రోజుల పాటు వారిని కూడా విచారించి బాలికపై జరిగిన లైంగిక దాడిపై ఓ అవగాహనకు రానున్నారు. ఇప్పటికే షాబుద్దీన్ ను పోలీసులు విచారిస్తున్నారు. కీలక ఆధారాలు సేకరించి వారిని కఠినంగా శిక్షించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read:Priyanka Arul Mohan: నాని హీరోయిన్ కి మహేష్ పక్కన ఛాన్స్?