Hyderabad Cricket Association: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య తరచూ వార్తల్లనే నిలుస్తోంది. ఈ అసోసియేషన్‌కు అన్ని రకాల హంగులు ఉన్నా కూడా.. అధోగతిలాగే ఉంది. ఈ అసోసియేషన్ లో పెద్దల మధ్య చాలా కాలంగా అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్ లో క్రికెట్ మ్యాచులే పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ క్రికెట్ భవిష్యత్ పూర్తి అగమ్య గోచరంగా మారిపోయింది.

కరోనా కంటే ముందు కూడా హైదరాబాద్ లో మ్యాచులు జరగలేదంటే అసోసియేషన్ పనితనం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కరోనా కంటే ముందు కూడా పెద్దగా మ్యాచులు జరగలేదు. ఇదే వీరి పని తనాన్ని చెబుతోంది. కరోనా కంటు ముందు జరిగిన ఐపీఎల్ సీజన్ లలో మాత్రమే హైదరాబాద్ లో మ్యాచులు జరిగాయి తప్ప అంతకు ముందు చెప్పుకోదగ్గ మ్యాచులు జరగలేదు.
Also Read: Increased Employment Guarantee Wage Rates : ‘ఉపాధి’కి మార్గం చూపిన కేంద్రం.. ఇక త్వరపడండి
అంతర్జాతీయ మ్యాచులు పెద్దగా జరగలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ ఏడాది అయితే మరీ దారుణం. ఐపీఎల్ మ్యాచులు అన్నీ కూడా ముంబై, పూణె, అహ్మదాబాద్‌కు తరలిపోయాయి. కానీ ఒక్కటి కూడా హైదరాబాద్ లో జరగట్లేదు. మరి హైదరాబాద్ కనిపించట్లేదా అంటే.. దీనికి బీసీసీఐ చెప్పే కారణం ఒక్కటే.
ఈసారి కొవిడ్ నాలుగో వేవ్ కారణంగా ఐపీఎల్ మ్యాచులు అన్నీ కూడా ముంబైలో నిర్వహిస్తున్నామని. ఇది వినడానికి చాలా కామెడీ ఆన్సర్. ఎందుకంటే దేశంలో కరోనా సమయంలో అధిక మరణాలు, కేసులు నమోదైంది మహారాష్ట్రలోనే. ముంబైతో పోలిస్తే హైదరాబాద్ లో కరోనా ప్రభావం చాలా తక్కువ. పైగా మెట్రో సిటీగా చాలా డెవలప్ అయింది కూడా.

కానీ ముంబై క్రికెట్ అసోసియేషన్ పూర్తిగా హైదరాబాద్ అసోసియేషన్‌ను డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి. రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్ స్టేడియం మన హైదరాబాద్ లోనే ఉంది. ఒకప్పుడు ఈ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచులతో సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు రూ.2 కోట్ల బకాయిలతో స్టేడియంకి కనీసం కరెంట్ కూడా దిక్కు లేదు.
గతంలో అసోసియేషన్ లో జరుగుతున్న అవతకతవకలపై సుప్రీం కోర్టు కూడా మొట్టికాయలు వేసింది. వాస్తవానికి అసోసియేషన్ లో అంతర్గత కుమ్ములాటల కారణంగా హైదరాబాద్ లో క్రికెట్ చరిత్ర కనుమరుగయ్యే ప్రమాదం వచ్చింది.
Also Read: Red Chilli Record Price: రైతు పంట పండింది.. ఎర్రబంగారానికి కాసుల వర్షం.. క్వింటాల్ రూ.52వేలు