Huzurabad bypoll: హుజురాబాద్ నియోజకవర్గ నేత పాడి కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ ఆమోదించినా ఫైల్ గవర్నర్ వద్దే ఆగిపోయింది. దీంతో ఆయన కల నెరవేరలేదు. అన్ని సవ్యంగా జరిగితే ఆయన ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మండలిలో పాల్గొనే అవకాశం దక్కేది. కానీ ఆయన ఫైల్ హోల్డ్ లో పడడంతో ఆయన ఇంకొంత కాలం ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడింది.

హుజురాబాద్ నియోజవర్గంలో వాయిస్ ఉన్న నేతగా గుర్తింపు పొందిన కౌశిక్ రెడ్డిని కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. ఆయనకు తగిన గుర్తింపు ఇచ్చే క్రమంలోనే ఆయనను ఎమ్మెల్సీగా చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఆయనను ఎమ్మెల్సీగా నియమించాలని బావించారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన అన్ని వివరాలతో ఫైల్ పంపినా గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో ఆయనకు పదవి కలగానే మిగిలిపోతోంది.
ఈటల రాజేందర్ పై ఆరోపణలు చేయడంతో కౌశిక్ రెడ్డి కేసీఱర్ ను ఆకర్షించారు. దీంతో కౌశిక్ రెడ్డి సేవలను ఉపయోగించుకోవాలని సీఎం అనుకుని ఆయనను పార్టీలో చేర్చుకుని పదవి కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆయన అదృష్టమో దురదృష్టమో కానీ ఫైల్ క్లియర్ కాకపోవడంతో పెండింగులో పడిపోయింది. ఆయన పదవీ కాంక్ష నెరవేరడం లేదు. ఇప్పటికే దాదాపు మూడు నెలలు దాటినా ఆయన ఎమ్మెల్సీ కల మాత్రం కలగానే ఉంటోందని తెలుస్తోంది.
అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తయ్యే వరకు ఆయన పదవిపై ఏ నిర్ణయం వెలువడదని తెలుస్తోంది. కౌశిక్ రెడ్డి ఫైలుపై గవర్నర్ ఆమోదముద్ర వేసే అవకాశం లేదని సమాచారం. సేవా కోటాలో ఫైల్ పంపడంతో దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని గవర్నర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి పదవి ఇప్పట్లో దగ్గరకు రాదనే విషయం తెలుస్తోంది. కేసీఆర్ సూచించినా ఆయనకు కలిసిరాకపోవడంతో ఫైల్ ఇంకా క్లియర్ కాలేదని పలువురు చెబుతున్నారు.