Hurun India Rich List : భారతదేశంలో గడిచిన పదేళ్లుగా కోటీశ్వరులు పెరుగుతున్నారు. 2014కు ముందు మన దేశంలో ఉన్న కోటీశ్వరలుతో పోలిస్తే.. 2023లో కోటీశ్వరులు భారీగా పెరిగారు. గతంలో కూడా వీరు ఉన్నారు. కానీ, ఐటీ చెల్లించేవారు కాదు. పదేళ్లుగా కేంద్రం తీసుకుంటున్న చర్యలతో పన్ను చెల్లించేవారు పెరుగుతున్నారు. దీంతో వీరి వివరాల ఆధారంగానే కేంద్రం దేశంలో కోటీశ్వరులు పెరుగుతున్నట్లు ప్రకటిస్తోంది. గడిచిన ఐదేళ్లలో అయితే కోటీశ్వరులు చెపుపకోదగిన స్థాయిలో పెరిగారు. అయితే సంసన్నులు కొన్ని రాష్ట్రాలకే పరిమితమవుతున్నారు. సంపద కొన్ని రాష్ట్రాల్లోనే పెరుగుతోంది. 2024లో ఎక్కువ మంది ధనవంతులు ఉన్న రాష్ట్రాల జాబితాను హురున్ ఇండియా రిచ్ లిస్టు విడుదల చేసింది. ఏ రాష్ట్రంలో ఎంత మంది ధనవంతులు ఉన్నారనే విషయాన్ని కూడా ఇందులో తెలిపింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో 2020తో పోలిస్తే ధనవంతులు పెరగగా, తమిళనాడు, కర్ణాటకలో తగ్గారు. ఇది ఆ రాష్ట్రాల ఆర్థిక కార్యకలాపాల పెరుగుదలను, సంపద సృష్టిని ప్రతిబింబిస్తుంది.
అగ్రస్థానంలో మహారాష్ట్ర..
దేశంలో ధనవంతులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉంది మహారాష్ట్ర. ఈ రాష్ట్రంలో మొత్తం 470 మంది సంపన్నులు ఉన్నారు. 2020లో 247 మంది ఉండగా, గడిచిన నాలుగేళ్లలో వీరి సంఖ్య 222 పెరిగింది. ఇక తర్వాతి స్థానంలో ఢిల్లీ నిలిచింది. ఈ రాష్ట్రంలో 2020లో 128 మంది ఉండగా, ఇపుపడు 213కు చేరింది.
– ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్ రాష్ట్రంలో 129 మంది, దక్షిణాది రాష్ట్రం తమిళనాడులో 119 మంది ధనవంతులు ఉన్నట్లు హురున్ ఇండియా రిచ్‌లిస్ట్ వె ల్లడించింది. రాష్ట్రాల్లో 2020లో వరుసగా 60, 65, మంది ధనవంతులు మాత్రమే ఉండేవారు. గుజరాత్, తమిళనాడులోనూ ధనవంతుల గణనీయంగా పెరిగారు.
తెలంగాణలో కూడా..
ఇక తెలంగాణలో 109 మంది ధనవంతులు ఉన్నారు. 2020లో తెలంగాణలో కేవలం 54 మంది సంపన్నులు ఉండగా, ప్రస్తుతం రెట్టింపు అయింది. ఇక ఐటీ రాజధాని కర్ణాటకలో సంపన్నులు తెలంగాణ కన్నా తక్కువ. ఈ రాష్ట్రంలో 108 మంది ఉన్నారు. 2020లో కర్నాటకలో 72 మంది ఉన్నారు. నాలుగేళ్లలో పెరిగినా, తెలంగాతో పోలిస్తే పెరుగుదల తక్కువగా ఉంది.
– పశ్చిమబెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా సంపన్నులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో వరుసగా 70, 40, 36, 28 మంది సంపన్నులు ఉన్నారు. 2020లో ఈ రాష్ట్రాల్లో ధనవంతుల సంఖ్య వరుసగా 32, 16, 9, 9గా మాత్రమే ఉండేది. గడిచిన నాలుగేళ్లలో కుబేరుల సంఖ్య భారీగా పెరిగింది.
వెనుకబడిన తమిళనాడు, కర్ణాటక..
2020లో ధనవంతుల జాబితాలో ముందు వరుసలో ఉన్న తమిళనాడు, కర్ణాటక ఈసారి వెనుకబడ్డాయి. ఆ రాష్ట్రాల్లో సంపన్నులు పెరిగినా, వృద్ధిరేటు తక్కువగా ఉంది. మొత్తంగా 2024లో మనదేశంలో ఉన్న ధనవంతుల సంఖ్య 1,322. 2020లో ఈ సంఖ్య కేవలం 693 మాత్రమే. నాలుగేళ్లలో ధనవంతులు రెట్టింపు అయ్యారు.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Hurun india rich list has released the list of states with the most rich people in 2024
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com