https://oktelugu.com/

దేశానికి రానున్న వందలమంది భారతీయులు!

కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డైన్‌ నేపథ్యలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్’ మిషన్ ద్వారా మన దేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కువైట్ నుంచి 200మంది తెలుగువారు శనివారం సాయంత్రానికి హైద్రాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఓ ప్రత్యేక విమానం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. మూడు వందల మంది ప్రయాణికులతో లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీ మీదుగా నేటి తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంది. కాగా మరో ఆరు […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 11, 2020 / 02:34 PM IST
    Follow us on

    కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌ డైన్‌ నేపథ్యలో విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను ‘వందే భారత్’ మిషన్ ద్వారా మన దేశానికి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో కువైట్ నుంచి 200మంది తెలుగువారు శనివారం సాయంత్రానికి హైద్రాబాద్ చేరుకున్నారు. ఈరోజు ఓ ప్రత్యేక విమానం లండన్ నుంచి బెంగళూరుకు చేరుకుంది. మూడు వందల మంది ప్రయాణికులతో లండన్ నుంచి బయలుదేరిన ఈ విమానం ఢిల్లీ మీదుగా నేటి తెల్లవారుజామున బెంగళూరుకు చేరుకుంది. కాగా మరో ఆరు ప్రత్యేక విమానాలు ఈరోజు రానున్నాయి. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ముంబై మీదుగా హైదరాబాద్ కు, అబుదాబి నుంచి హైదరాబాద్ కు, కౌలాలంపూర్ నుంచి చెన్నైకు, ఢాకా నుంచి ముంబైకు, దుబాయ్ నుంచి కొచ్చికి, బహ్రెయిన్ నుంచి కోజికోడ్ కు ఈ ప్రత్యేక విమానాలు చేరుకోనున్నాయి.

    ఈ మిషన్ ద్వారా భారత్ కి వచ్చే ప్రతి వారిని 28 రోజుల పాటు క్వారంటైన్‌ లో ఉంచిన తర్వాతే వారి వారి ప్రాంతాలకు పంపిస్తారు. భారత్ పై అడుగుపెట్టిన ప్రతిఒక్కరు క్వారంటైన్‌ లోకి వెళతారు. ఇందుకోసం హోటళ్లు, లాడ్జీలలో ప్రత్యేక ఏర్పాటు చేసిన ప్రభుత్వం రూ. 5 వేల నుంచి రూ. 30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. ఆ ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రాలకు తరలిస్తారు.