
తెలుగుదేశం పార్టీ నాయకులకు లాక్ డౌన్ తో మతి భ్రమించినట్టుందని వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి పేర్కొన్నారు. కరోనా ర్యాపిడ్ కిట్ల ధరలపై అరిచి, అరిచి భంగపడ్డారని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. కిట్ల తయారీ కంపెనీలో వాటాలున్నాయని, డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకున్నారని మంటలు రాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రివర్స్ టెండర్ల విధానంలో రూ. 2 వేల కోట్ల ప్రజాధనం ఆదాచేసిన సిఎం ఉన్నారిక్కడ, నోరు పారేసుకోవద్దు అని హెచ్చరించారు.
విజయసాయిరెడ్డి.. జగన్ కు బలమా? బలహీనతా?
చంద్రబాబు ఈ వయసులో బయటకు రాలేకున్నా కనీసం లోకేశ్ నాయుడైనా తమ పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మంత్రిగా పదవి అనుభవించిన వ్యక్తి ఇంట్లో కూర్చుని ట్విట్టర్లో ఆవేశపడితే ఎలా? అంటూ హితవు పలికారు. కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరిన వారితో మాట్లాడాలని కోరారు. తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడం కాదని ఎద్దేవ చేశారు.
అలిగిన అఖిల ప్రియ… తమ్ముడి కోసం టిడిపికి దూరంగా!
నెలలో మూడుసార్లు ఉచితంగా రేషన్ ఇస్తే, ఇంకా అన్న క్యాంటీన్లు తెరవాలని రాద్దాంతం చేస్తున్నారని తెలిపారు. క్యాంటీన్ లది రూ.100 కోట్ల స్కామ్ అని పేర్కొన్నారు. క్యాంటీన్ల పేరుతో నిర్మించిన షెడ్లలో ఎవరెంత దోచుకున్నది త్వరలోనే బయటపడుతుందని హెచ్చరించారు. పేదల భోజనంలో కూడా కక్కుర్తి పడ్డ బతుకులు మీవి అంటూ విమర్శలు గుప్పించారు.
అదేవిధంగా హంద్వారాలో ఉగ్రవాదులతో పోరాడి, అమరవీరులైన వీర జవాన్ లకు, సైనిక అధికారులకు నివాళులర్పించారు. వారి ధైర్యం మరియు త్యాగం పౌరులందరి ప్రాణాలను కాపాడిందంటూ మరో ట్వీట్ చేశారు.