భారీ షాక్: సీఎం రాజీనామా

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ ఇంట ఓడిపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇప్పుడు బెంగాల్ లో మెజార్టీ సీట్లు సాధించి బీజేపీని చిత్తు చేసిన మమతా బెనర్జీ తాను పోటీచేసిన నందిగ్రామ్ లో మాత్రం ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు. ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు.. దీంతో ఆరునెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. […]

Written By: NARESH, Updated On : July 3, 2021 8:39 am
Follow us on

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు.. కానీ ఇంట ఓడిపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. ఇప్పుడు బెంగాల్ లో మెజార్టీ సీట్లు సాధించి బీజేపీని చిత్తు చేసిన మమతా బెనర్జీ తాను పోటీచేసిన నందిగ్రామ్ లో మాత్రం ఓడిపోయి పరువు పోగొట్టుకున్నారు.

ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేశారు. మార్చి 10న తీరత్ సింగ్ ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాదు.. దీంతో ఆరునెలల్లోపు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంది. కానీ సెప్టెంబర్ 5వ తేదీతోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీకి గడువు ముగుస్తోంది. ఈ క్రమంలోనే సపరేట్ గా ఎన్నికలు పెట్టే అవకాశం లేదు. అప్పటివరకు ఆగాల్సిందే.

దీంతో కేంద్రం సూచనల మేరకు ఉత్తరాఖండ్ సీఎం రాజీనామా చేశారు. ఆరు నెలల్లోపు ఎన్నిక కాకుంటే సీఎంగా ఉండడానికి అనర్హులు. భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారం రాజ్యాంగ సంక్షోభం తలెత్తుతుంది. అందుకే రాజీనామా చేసి కొత్త ప్రభుత్వంతోపాటే తాను ఎన్నిక అవ్వాలని సీఎం రావత్ రాజీనామా చేశారు.

మరో మూడు నెలల్లోనే ఉత్తరాఖండ్ ఎన్నికలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలవలని రావత్ రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో ఈ మూడు నెలలకు గాను మరో కీలక నేతను ముఖ్యమంత్రిని చేసేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతం ఉత్తరాఖండ్ సీఎం రేసులో సత్పాల్, ధన్ సింగ్ పేర్లు ఉన్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజీఎల్పీ సమావేశం అనంతరం ఈ మూడు నెలల కాలానికి కొత్త సీఎం పేరు ప్రకటించనున్నారు.