AP Government Staff: కర్ర విరగొద్దు, పాము చావొద్దు అనే సామెత మీ అందరికీ గుర్తుంది కదా.. ఇప్పుడు ఏపీలో కూడా జగన్ సర్కార్‌కు ఇలాంటి ప్రతిపాదన చాలా అవసరం. అంటే ఉద్యోగులకు పీఆర్సీ పెంచొద్దు, వారిని దారిలోకి తెచ్చుకోవాలి అన్నట్టు పరిస్థితులు తయారయ్యాయి. మొన్నటి వరకు చర్చల్లో గడిచిన కాలం కాస్తా.. ఇప్పుడు సకల జనుల సమ్మె వరకు వస్తోంది. సోమవారం నుంచి అన్ని శాఖల ఉద్యోగులు సమ్మెలో పాల్గొనే అవకాశం ఉంది.

ఇది జగన్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి. రాష్ట్రంలో వీరి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇంతమంది ప్రభుత్వ ఉద్యోగులు రోడ్డు ఎక్కితే గనక దేశ వ్యాప్తంగా ఈ అంశం హాట్ టాపిక్ అవుతుంది. జాతీయ స్థాయిలో జగన్ మీద వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు అన్నీ ఒక్కటైపోయాయి. మరి ఈ సమయంలో వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తే జగన్‌కే నష్టం అంటున్నారు చాలామంది.
గతంలో చూసుకుంటే.. చంద్రబాబు హయాంలో ఆర్టీసీ కార్మికుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించి వారిని దారిలోకి తెచ్చుకున్నారు. ఇక తెలంగాణలో కేసీఆర్ కూడా ఇలాగే ఆర్టీసీ కార్మికుల పట్ల అత్యంత కఠినంగా నిర్ణయాలు తీసుకుని, చివరకు తన పంతం నెగ్గించుకున్నారు. ఆ సమయాల్లో కేవలం ఒక్క శాఖ మాత్రమే సమ్మె చేసింది కాబట్టి కేసీఆర్, చంద్రబాబులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కానీ ఇప్పుడు ఏపీలో ఒక్క పోలీస్ శాఖ మినహా.. అన్ని శాఖలు రేపటి నుంచి జరిగే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొననున్నాయి.
Also Read: చిరు ‘జగన్’ దగ్గర సాధించింది ఏమిటి ?
వీరందరి పట్ల ఈ కరోనా సమయంలో కఠినంగా వ్యవహరిస్తే అది జగన్‌కే నష్టం అంటున్నారు నిపుణులు. ఇప్పటికే ఆయా ఉద్యోగ సంఘాలు, సీఎస్‌కు లెటర్ కూడా ఇచ్చాయి. అన్ని శాఖలు ఆందోళనలో పాల్గొంటే ప్రభుత్వ పాలన కుంటు పడుతుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఉద్యోగులు వారి జీతాల పరంగా ఇప్పటి వరకు సంపాదన పరులుగానే ఉంటున్నారు. కానీ కొత్త పీఆర్సీ, హెచ్ ఆర్ ఏ మార్పులు కారణంగా జీతాల్లో కోతలు తప్పేలా లేవు.
ఇప్పటి వరకు అంతంత జీతాలు తీసుకున్న వారు ఇప్పుడు తక్కువ ఇస్తామంటే ససేమిరా ఒప్పుకోరు. మరి వారితో కయ్యానికి పోతే జగన్ ప్రభుత్వాన్ని పడగొడుతారా అనే చర్చ కూడా మొదలయింది. వీరు ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక పోవచ్చు గానీ.. రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. వీరంతా జగన్‌కు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం ఫలితాలు తారుమారయిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ అంశాన్ని సున్నితంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం జగన్‌కు ఉంది.
Also Read: శ్రీశ్రీ కవితలు చదివి మరీ జగన్‌పై ఆర్ఆర్ఆర్ ప్రతాపం.. చూడాల్సిందే?