సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాక్డౌన్ చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మరి విషయంలో ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతుంది. దీంతో పలువురు ప్రముఖులు తెలంగాణ సహాయనిధికి తమవంతు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ సీఎం సహాయనిధికి ఇప్పటివరకు 13కోట్ల విరాళాలు వచ్చినట్లు సమాచారం. హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం, రూ. 5కోట్ల విలువైన మందులను అందించేందుకు ముందుకొచ్చింది. వాల్యూ ల్యాబ్స్ రూ.5.25 కోట్ల విరాళం, […]

Written By: Neelambaram, Updated On : March 31, 2020 12:31 pm
Follow us on

తెలంగాణలో కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇప్పటికే లాక్డౌన్ చర్యలు చేపట్టింది. కరోనా మహమ్మరి విషయంలో ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతుంది. దీంతో పలువురు ప్రముఖులు తెలంగాణ సహాయనిధికి తమవంతు సహాయం అందించేందుకు ముందుకొస్తున్నారు. సోమవారం ఒక్కరోజే తెలంగాణ సీఎం సహాయనిధికి ఇప్పటివరకు 13కోట్ల విరాళాలు వచ్చినట్లు సమాచారం.

హెటిరో డ్రగ్స్ రూ.5 కోట్ల విరాళం, రూ. 5కోట్ల విలువైన మందులను అందించేందుకు ముందుకొచ్చింది. వాల్యూ ల్యాబ్స్ రూ.5.25 కోట్ల విరాళం, సువెన్ ఫార్మా కోటి రూపాయలు, ఎన్.సి.సి. లిమిటెడ్ కోటి రూపాయలు, శ్రీచైతన్య విద్యాసంస్థలు కోటి రూపాయలు, తెలంగాణ మోటార్ వెహికిల్స్ ఇన్స్ పెక్టర్ అసోసియేషన్ తరపున రూ.1.5 కోట్ల విరాళాలను ప్రకటించారు.

ఇందుకు సంబంధించిన చెక్కులను ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలువురు విరాళాలకు సంబంధించిన చెక్కులను అందజేశారు. వీరిని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. అదేవిధంగా పెద్దమొత్తంలో సీఎం సహాయనిధికి విరాళాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్న దాతలకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.