Afghanisthan, Talibans: అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల గెలుపు ఎలా సాధ్యమైంది?

అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అధికారం అందుకున్నారు. ఎలాంటి ప్రతిఘటనలు లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. ప్రపంచం తమ వెంట ఉంటుందని భావించిన అఫ్గన్లకు నిరాశే మిగిలింది. తాలిబన్ల రాక్షస పాలనలోకి వెళ్లడం ఆందోళనకు కారణమవుతోంది. అత్యాధునిక ఆధునిక సామగ్రిని అమెరికా అఫ్ఘాన్ దళాలకు అప్పగించింది. 2001 సెప్టెంబర్ ఉగ్రవాద దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ జూనియర్ సారధ్యంలో అఫ్గానిస్థాన్ పై దాడులు జరిగాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పవనాలను […]

Written By: Srinivas, Updated On : August 15, 2021 7:30 pm
Follow us on

అఫ్ఘనిస్థాన్ లో తాలిబన్ల అధికారం అందుకున్నారు. ఎలాంటి ప్రతిఘటనలు లేకుండానే తాలిబన్లకు ప్రభుత్వ పగ్గాలను అప్పగించింది. ప్రపంచం తమ వెంట ఉంటుందని భావించిన అఫ్గన్లకు నిరాశే మిగిలింది. తాలిబన్ల రాక్షస పాలనలోకి వెళ్లడం ఆందోళనకు కారణమవుతోంది. అత్యాధునిక ఆధునిక సామగ్రిని అమెరికా అఫ్ఘాన్ దళాలకు అప్పగించింది. 2001 సెప్టెంబర్ ఉగ్రవాద దాడుల అనంతరం అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ జూనియర్ సారధ్యంలో అఫ్గానిస్థాన్ పై దాడులు జరిగాయి. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా ప్రజాస్వామ్య పవనాలను ఆస్వాదించిన అఫ్ఘాన్ ప్రజలకు తాజాగా మళ్లీ తాలిబన్ల పాలన రావడం అంతులేని విషాదం మిగిల్చిందని అఫ్ఘాన్ వాసులు ఆవేదన చెందుతున్నారు.

అఫ్ఘాన్ నుంచి తమ దళాలను సెప్టెంబర్ 11 కల్లా ఉపసంహరిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించడంతో తాలిబన్లలో ఉత్సాహం ప్రారంభమైంది. అఫ్ఘాన్ సైనిక బలగాల సంఖ్య దాదాపు మూడు లక్షల వరకు ఉంటుందని అంచనా. తాలిబన్ల సంఖ్య 75 వేలకు మించదు. అఫ్ఘాన్ సైన్యం మానసిక స్థైర్యం దెబ్బతీసేలా అమెరికా సేనలు త్వరితగతిన వెనక్కి వెళ్లడం ప్రారంభించాయి.

ఉత్తర కుందుజ్ నే తీసుకుంటే దాదాపు రెండు నెలల పాటు తాలిబన్లు దిగ్భంధించారు. అఫ్ఘాన్ సేనలకు వచ్చే ఆహారం, మందు గుండు సామగ్రి సరఫరాను అడ్డుకున్నారు. దీంతో అఫ్ఘాన్ సేనలు తమ ఆయుధాలను అప్పగించి లొంగిపోయాయి. మరికొందరు ఆయుధాలను పారవేసి పారిపోయారు. గేటులోకి తాలిబన్లు వచ్చినా ఎలాంటి ప్రతిఘటన లేకుండా సైన్యం తిరుగుముఖం పట్టింది.

బుష్ హయాంలో అఫ్ఘాన్ పై సైనికదాడులు చేపట్టినప్పుడు కేవలం తాలిబన్లకు అధికారం నుంచి దించేయడంపైనే అమెరికా దృష్టి పెట్టించింది. అనంతరం విధానాన్ని మార్చుకుని ఆ దేశ పునర్ నిర్మాణం చేపట్టింది. అయితే అప్ఘనిస్తాన్ లో సహజ వనరులు ఏమీ లేవు. పెట్రోల్, ఖనిజాలు కూడా లేవు.  అమెరికా ఆ దేశంలో సైనికులను, ఇతరులను మోహరించడం వల్ల ఆదేశానికి దమ్మిడి ఉపయోగం లేదు. ఇప్పటికే లక్షల కోట్ల డాలర్లను ఆ దేశంలో ఖర్చుపెట్టింది. ఇది అమెరికాకు నష్టమే. దీంతో అఫ్ఘాన్ నుంచి అమెరికా వెనక్కి మళ్లాలని డిమాండ్లు పెరగడంతో అమెరికా అధ్యక్షుడు పర్యవేక్షించి అఫ్ఘాన్ పై తమ సేనలను తిరిగి రప్పించుకున్నాయి.