Hindi Controversy: దేశంలో హిందీ భాషపై మరోమారు విమర్శలు వస్తున్నాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా హిందీ జాతీయ భాషగా ప్రకటించలని చూస్తున్న తరుణంలోని అన్ని రాష్ట్రాల్లో వ్యతిరేకత వస్తోంది. ఏ రాష్ర్టంలో అయినా అక్కడి ప్రాంతీయ భాష ఉండటంతో హిందీని ఎలా జాతీయ భాషగా ఎంచుకుంటారనే ప్రశ్నలు వస్తున్నాయి. అమిత్ షా చేసిన ప్రకటనతో రాజకీయ దుమారం రేగుతోంది. దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హిందీ ఆంగ్లానికి ప్రత్యామ్నాయం కాదని చెబుతున్నారు.

గతంలోనే హిందీ అమలుపై అభ్యంతరాలు వచ్చినా మరోమారు దాని గురించి అమిత్ షా ప్రస్తావించడం విమర్శలకు తావిచ్చింది. హిందీని బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని అన్ని ప్రాంతాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందీ జాతీయ భాష కాదని అందరు ముక్తకంఠంతో నినదిస్తున్నారు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణతోపాటు ఏ రాష్ట్రం కూడా హిందీని జాతీయ భాషగా ఒప్పుకోవడం లేదు.
Also Read: TRS Flexis In Delhi: ఢిల్లీలో హిందీ ఫ్లెక్సీల ఏర్పాటులో ఆంతర్యం అదేనా?
ఒకే దేశం ఒకే భాష అన్న నినాదాన్ని దేశవ్యాప్తంగా వ్యాపింపజేసేందుకు అమిత్ షా నిర్ణయించినా అది సాధ్యం కాదని తెలుస్తోంది. భారతదేశం లౌకిక రాజ్యం కావడంతో ఎవరికి ఇష్టమొచ్చిన మతం, భాష, ప్రాంతం ఏదైనా మన ఇస్ట ప్రకారం ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే జాతీయ భాష అనే అంశం ప్రజలపై రుద్దొద్దని సూచిస్తున్నారు. ప్రజలకు ఏది ఇష్టమైతే దాన్ని ఆచరించడం తెలిసిందే.
అమిత్ షా చేసిన ప్రకటనతో దేశవ్యాప్తంగా ఆందోళనలు కలుగుతున్నాయి. అమిత్ షా ప్రకటన దేశ సమగ్రతను దెబ్బతీసేదిగా ఉందని అందరిలో అభిప్రాయం వస్తోంది. భవిష్యత్ లో భిన్నత్వంలో ఏకత్వం నినాదానికి తూట్లు పొడిచేదిగా ఉందని పలు రాష్ట్రాలు భావిస్తున్నాయి. దేశంలో అత్యధిక మంది మాట్లాడే భాష హిందీ అయినా దాన్ని జాతీయ భాషగా చేసి అందరిపై రుద్దడం సమంజసం కాదనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిందీ భాష అమలుపై అందరిలో సందేహాలు వస్తున్నట్లు తెలుస్తోంది.

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. హిందీని జాతీయ భాషగా చేసి దాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దే పనికి అమిత్ షా ముందుకు రావడంపై విమర్శలే వస్తున్నాయి. హిందీనే జాతీయ భాషగా మారుస్తూ అందరిపై బాధ్యతలు పెట్టడం సరైంది కాదనే అభిప్రాయాలు అందరిలో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని హితవు పలుకుతున్నారు.
Also Read: CM KCR: జీతాల్లేవ్ మరీ.. అప్పులు చేస్తున్న కేసీఆర్ సార్?