https://oktelugu.com/

KTR – Himansh : తాత కేసీఆర్ ను దేవుడిని చేసిన హిమాన్షు.. వైరల్ వీడియో

ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి హిమాన్షు సోషల్‌ మీడియా ప్రచారం బీఆర్‌ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి.

Written By:
  • NARESH
  • , Updated On : October 13, 2023 4:17 pm
    Follow us on

    KTR – Himansh : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల గడువు మాత్రమే ఉంది. దీంతో హ్యాట్రిక్‌పై కన్నేసిన బీఆర్‌ఎస్‌ విపక్షాలకంటే ముందే.. అభ్యర్థులను ప్రకటించింది. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు కృష్ణార్జునుల్లా ఇప్పటికే సంగ నియోజకవర్గాల్లో ఓ విడత ప్రచారం పూర్తిచేశారు. ఈనెల 16 నుంచి కేసీఆర్‌ కూడా ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రచారం మొదలెట్టారు. అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రభుత్వ సంక్షేమ పథకాల విశిష్టతను వివరిస్తున్నారు. అంతేకాదు.. సోషల్‌ మీడియాలో విస్తృతంగా పోస్టులు పెట్టడంతోపాటు ‘కేసీఆర్‌ వన్స్‌ ఎగైన్‌’ అంటూ గత నాలుగైదు రోజులుగా ట్రెండ్‌ చేస్తున్నారు.

    కేసీఆర్‌ మనుమడు ఎంట్రీ..
    ఈసారి ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్‌ మనవడు, మంత్రి కేటీఆర్‌ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా కాకపోయినా.. సోషల్‌ మీడియా వేదికగా పార్టీకి తనవంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలను, కేసీఆర్‌ పరిపాలనను వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. తాజాగా.. రెండ్రోజుల క్రితం ఓ ఆసక్తికర పోస్టు పెట్టారు.

    ఆ సినిమా డైలాగ్‌తో..
    చిన్న సినిమాగా విడుదలై ఇండియన్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేసిన కార్తికేయ-2 చిత్రంలోని ఒక డైలాగ్‌ను సీఎం కేసీఆర్‌ను వీడియోలకు లింక్‌ చేస్తూ ఇన్‌స్టాలో హిమాన్షు బీఆర్‌ఎస్‌ ప్రచారం మొదలు పెట్టారు. ఈ పోస్టుకు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మళ్లీ కేసీఆరే గెలుస్తారని అంటుండగా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేవలం హైదరాబాద్‌ నగరాన్నే అభివృద్ధి చేశారు. గ్రామాలను గాలికొదిలేశారు. ఎట్టిపరిస్థితుల్లో ఈసారి కేసీఆర్‌ ఓడిపోవడం ఖాయమని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరి హిమాన్షు సోషల్‌ మీడియా ప్రచారం బీఆర్‌ఎస్‌కు ఎంతమేర పనిచేస్తుందో చూడాలి.

    నాడు చర్చచేసి.. నేడు రాజకీయంలోకి..
    మూడేళ్ల క్రితం హిమాన్షుపై పెద్ద రచ్చ జరిగింది. తీన్మార్‌ మల్లన్న హిమాన్షును బాడీ షేమింగ్‌ చేశారని కేటీఆర్, కవితతోపాటు బీఆర్‌ఎస్‌ నేతలు హంగామా చేశారు. కేసీఆర్‌ తన మనుమడితో రాములవారికి తలంబ్రాలు పంపించారు. దీనినే తీన్మార్‌ మల్లన్న తప్పు పట్టారు. కానీ, రాజకీయాలతో సంబంధం లేని హిమాన్షును రాజకీయాల్లోకి లాగడాన్ని బీఆర్‌ఎస్‌తోపాటు విపక్ష నేతలు కూఆ తప్పు పట్టారు. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియాలో బీఆర్‌ఎస్‌ రాజకీయ ప్రచారం హిమాన్షుతో ప్రారంభించడం చర్చనీయాంశమైంది. ప్రచారంతోపాటు ఆరోపణలు ఎదుర్కొవడానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. పిల్లాడిని పిల్లాడిలా ఉంచకుండా రాజకీయంలోకి తాత, తండ్రి తీసుకొస్తున్నారని తెలుస్తోంది.