డాక్టర్ కొడుకు డాక్టర్.. యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతున్న రోజులివీ.. అలాగే రాజకీయ నేతల వారసులు అదే రాజకీయాల్లోకి వచ్చి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోతున్నారు. అన్నింటికంటే లాభసాటి వ్యవహారం రాజకీయమేనన్న టాక్ ఉంది.
కానీ తెలంగాణ సీఎం , అపర రాజకీయ యోధుడైన కేసీఆర్ కు తగ్గ మనువడు మాత్రం రాజకీయాలపై ఆసక్తి కనబరచకపోవడం విశేషమే మరీ..
తాత కేసీఆర్ దేశంలోనే రాజకీయ చాణక్యంలో ఆరితేరిన పక్కా రాజకీయ వాది. అలాంటి కడుపున పుట్టిన కేటీఆర్ సైతం కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరుగాంచాడు. మరి వీరిద్దరి తర్వాత కేటీఆర్ కుమారుడు హిమాన్షు వస్తాడని అందరూ ఊహించుకుంటారు. కానీ తాజాగా తాత కేసీఆర్ బాటలో తాను నడవనని చెబుతూ హిమాన్షు షాక్ ఇచ్చాడు.
కేసీఆర్ బాటలోనే కేటీఆర్, హరీష్ రావులు నడిచారు. ఇక అంతటి పక్కా రాజకీయ కుటుంబంలో ఉన్న హిమాన్షు మాత్రం తాను రాజకీయాల్లోకి రానని సంచలన ప్రకటన చేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా మాట్లాడిన కేసీఆర్ మనవడు హిమాన్షు ‘తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని.. ఎప్పటికీ వాటిలోకి రానని’ హిమాన్షు రావు స్పష్టం చేశాడు. ‘నాకు రాజకీయాలు వద్దు. నా లక్ష్యాలు, నేను సాధించాల్సినవి చాలా ఉన్నాయి’ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు.
ఎంతో రాజకీయ మేధావి అయిన కేసీఆర్ కుటుంబంలోని వ్యక్తి తాను రాజకీయాల్లోకి రానని.. అవంటే ఇష్టం లేదని తెలుపడం నిజంగానే చర్చనీయాంశంగా మారింది.