https://oktelugu.com/

Corona Cases: వ్యాక్సిన్ వేసుకున్నా డెల్టా అటాక్: బ్రిటన్, అమెరికా అతలాకుతలం..

అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్ లను మరోసారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. డెల్టా వైరస్ ముప్పేటదాడి చేస్తోంది.ఈ కొత్తరకం వేరియంట్ కేసులు రెండు దేశాల్లో భారీగా పెరుగుతున్నాయి. విశేషం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ డెల్టా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయని చెబుతున్నారు. భారత్ లోనూ డెల్టా కేసుల తీవ్రత పెరిగిందని అంటున్నారు. వైరస్ వ్యాప్తిని నిరోధించడంలోవ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఇన్నాళ్లు డబ్ల్యూ.హెచ్.వో సహా వైద్యవర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్ లో సగం వ్యాక్సినేషన్ పూర్తయినా.. 70శాతం […]

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2021 / 08:54 AM IST
    Follow us on

    అగ్రరాజ్యాలు అమెరికా, బ్రిటన్ లను మరోసారి కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. డెల్టా వైరస్ ముప్పేటదాడి చేస్తోంది.ఈ కొత్తరకం వేరియంట్ కేసులు రెండు దేశాల్లో భారీగా పెరుగుతున్నాయి. విశేషం ఏంటంటే వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ డెల్టా వైరస్ కేసులు వెలుగుచూస్తున్నాయని చెబుతున్నారు. భారత్ లోనూ డెల్టా కేసుల తీవ్రత పెరిగిందని అంటున్నారు.

    వైరస్ వ్యాప్తిని నిరోధించడంలోవ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఇన్నాళ్లు డబ్ల్యూ.హెచ్.వో సహా వైద్యవర్గాలు భావించాయి. కానీ ఇప్పుడు అమెరికా, బ్రిటన్ లో సగం వ్యాక్సినేషన్ పూర్తయినా.. 70శాతం ఫస్ట్ డోస్ పడినా కూడా డెల్టా వేరియంట్ కేసుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది.

    ఊరట కలిగించే విషయం ఏంటంటే.. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వ్యాధి తీవ్రత అంతగా కనిపించడం లేదని.. మరణాలు దాదాపుగా లేవని ఐఎన్ఎస్ఎసీఏజీ వెల్లడించింది. ప్రస్తుతం భారత్ లో 30230 రక్త పరీక్షలు చేస్తే వాటిలో 20324 డెల్టా కేసులేనని తేల్చారు.

    డెల్టా రకం వైరస్ ఇప్పటికే అమెరికా, బ్రిటన్ , పోర్చుగల్ సహా ప్రపంచంలోని 11 దేశాలకు పాకింది. ఈ దేశాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉంది. చాలా దేశాల్లో కరోనా వైరస్ మరోసారి విజృంభణకు ఈ వేరియంట్ దోహదం కానుందని డబ్ల్యూ.హెచ్.వో హెచ్చరించింది.

    అమెరికా, బ్రిటన్ లో ఇప్పుడు డెల్టా వేరియంట్ కేసులు విజృంభిస్తున్నాయి. డెల్టా రకాన్ని ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ ఒక్కటేసరిపోదని.. తప్పనిసరిగా మాస్కులు భౌతిక దూరం పాటించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలకు పిలుపునిచ్చింది. వ్యాక్సినేషన్ వల్ల వైరస్ వ్యాప్తిని తగ్గించడంతోపాటు తీవ్ర ఇన్ ఫెక్షన్ నుంచి బయటపడవచ్చని అంటున్నారు.