https://oktelugu.com/

కరోనా టెస్టులపై హైకోర్టు అసంతృప్తి!

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కరోనా టెస్టుల విషయంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ‘హైరిస్క్ అవకాశాలున్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదు?. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారు?. మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలన్నీ సమర్పించాలి. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలి. కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో.. ఎంత […]

Written By: , Updated On : May 26, 2020 / 08:08 PM IST
Follow us on

తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కరోనా టెస్టుల విషయంపై హైకోర్టు మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ఉత్తర్వులను హైకోర్టు కొట్టివేసింది. ‘హైరిస్క్ అవకాశాలున్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదు?. ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ టెస్టులు చేస్తున్నారు?. మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన పరీక్షల వివరాలన్నీ సమర్పించాలి. కరోనా పరీక్షలపై కేంద్రం రెండు సార్లు రాసిన లేఖలు సమర్పించాలి. కరోనా రక్షణ కిట్లు ఎన్ని ఆస్పత్రుల్లో.. ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో… జూన్‌ 4లోగా నివేదిక ఇవ్వాలి’’ అని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.