Homeజాతీయ వార్తలుTRS MLAs Purchase Case- BL Santosh: తెలంగాణ సిట్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు.. బీఎల్‌.సంతోష్‌కు...

TRS MLAs Purchase Case- BL Santosh: తెలంగాణ సిట్‌కు హైకోర్టు కీలక ఆదేశాలు.. బీఎల్‌.సంతోష్‌కు మళ్లీ నోటీసులు!!

TRS MLAs Purchase Case- BL Santosh: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు తిరిగి విచారణ చేపట్టింది. బుధవారం సిట్‌ అధికారులకు కీలక ఆదేశాలు జారే చేసింది. నోటీసులు ఇచ్చినా ఈనెల 21న విచారణకు హాజరు బీఎల్‌.సంతోష్‌కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.

TRS MLAs Purchase Case- BL Santosh
BL Santosh

ఈసారి అలా ఇవ్వండి..
ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబధించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎస్‌.సంతోష్‌కు మరోమారు కొత్తగా నోటీసులు ఇవ్వాలని న్యాయమూర్తి సిట్‌కు సూచించారు. సంతోష్‌ గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నారని, ఎన్నికల తరువాతే నోటీసులు ఇవ్వాలని బీజేపీ కోరింది. స్పందించిన న్యాయమూర్తి ఈమెయిల్‌ ద్వారా కొత్త నోటీసులు పంపించాలని న్యాయమూర్తి సిట్‌ను ఆదేశించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పరిశీలించిన అనంతరం హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

30వ తేదీదకి విచారణ వాయిదా..
ఎమ్మెల్యే ఎర కేసు విచారణను ఈనెల 30వ తేదికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. అయితే బీఎల్‌.సంతోష్‌ ఏ రోజు విచారణకు హాజరు కావాలన్న విషయంపై మాత్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో సిట్‌ నోటీసులు ఇచ్చిన తరువాత ఎప్పుడు విచారణకు వస్తారో బీఎస్‌.సంతోష్‌ చెప్పాల్సి ఉంటుంది. గుజరాత్‌ ఎన్నికలు అయిపోయాకే సంతోష్‌ విచారణకు హాజరు అవుతారా లేక, ఈనెల 30న హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.

TRS MLAs Purchase Case- BL Santosh
BL Santosh

ప్రత్యేక దర్యాప్తు బృందం అవసరమా?
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసుకు సంబంధించి హైదరాబాద్‌ సీపీ సీవీ.ఆనంద్‌తో సహా పలువురితో కలిపి ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే ఈ కేసులో సిట్‌ ఏర్పాటు చేయడం సరైందేనా. లేక హైకోర్టు ప్రత్యేక బృందాన్ని నియమిస్తుందా లేక సీబీఐకి కేసు అప్పగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బుధవారం జరిగిన విచారణ అంతా సంతోష్‌ చుట్టూనే తిరుగుతుంది. ఈ విచారణకు సంతోష్‌ గానీ, అతని తరఫు న్యాయవాది గానీ హాజరు కాలేదు. ఎలాగైనా సంతోష్‌ను విచారణకు రప్పించాలని సిట్‌ ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై ఈనెల 30న హైకోర్టు ఇచ్చే ఆదేశాలపై సంతోష్‌ హాజరు ఆధారపడి ఉంటుంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version