Schools Reopening: కరోనా నేపథ్యంలో పాఠశాలల పున:ప్రారంభంపై అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఆంక్షల మేరకు ఈనెల 30 వరకు సెలవులు ప్రకటించగా 31 నుంచి స్కూళ్లు ప్రారంభించాలా? వద్దా? అనేదానిపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీంతో హైకోర్టు పలు ప్రశ్నలు సంధించింది. స్కూళ్ల ప్రారంభంపై ఏం చర్యలు తీసుకున్నారో తెలపాలని ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ ను ప్రశ్నించింది. దీనిపై ఆయన ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. దీనిపై మూడు రోజుల్లో తేల్చాలని సూచించింది.

రాష్ర్టంలో కొవిడ్ పాజిటివిటీ రేటు 3.16 శాతంగా ఉందని దీంతో ఆంక్షలు విధించాల్సిన అవసరం రాకపోవచ్చని తెలిపారు. ప్రైవేటు పాఠశాలల ఒత్తిడులు పెరిగిపోయాయి. రెండేళ్లుగా కరోనా ప్రభావంతో పాఠశాలలు నడవక ఇబ్బందులు పడుతున్నామనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. దీంతో సర్కారు నిర్ణయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. పాఠశాలల ప్రారంభంపైనే విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉందని తెలుస్తోంది.

త్వరలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతరపై ఏం చర్యలు తీసుకుంటున్నారు. జాతర నిర్వహణపై ఆంక్షలు విధించారా? లేదా? అని అడిగింది. దీంతో మూడు రోజుల్లోగా అన్ని అంశాలపై సమగ్ర నివేదికలతో హాజరు కావాలని సూచించింది. కరోనా వైరస్ నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు ప్రశ్నలు వేసింది. దీంతో హెల్త్ డైరెక్టర్ సైతం అన్ని వివరాలతో వస్తానని చెప్పారు. పాఠశాలల ప్రారంభంపై ఇంకా సందిగ్దం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఇంకా ఏ చర్యలు తీసుకోలేదు.

Also Read: వెలుగులోకి మరో కొత్త వైరస్.. డేంజర్ బెల్స్..!
వైరస్ వేగంగా విస్తరిస్తోన్న ప్రాణాపాయం మాత్రం లేకపోవడం కొంత ఊరట కలిగిస్తోంది. కానీ జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి అయిపోతున్నాయి. కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని పాఠశాలలకు సెలవులు పొడిగించిన సంగతి తెలిసిందే. కానీ విద్యార్థుల భవిష్యత్ కోసం మళ్లీ ప్రారంభించాల్సిన అవసరం ఉందని డిమాండ్లు వస్తున్నా తల్లిదండ్రులు మాత్రం సాహసం చేయొద్దని సూచిస్తున్నారు. దీంతో పాఠశాలల ప్రారంభంపై మళ్లీ అనుమానాలు వస్తున్నాయి. సర్కారు ఏ మేరకు నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇప్పటికే 15-18 ఏళ్ల వారికి వ్యాక్సిన్ పూర్తయిన నేపథ్యంలో భయపడాల్సిన పనిలేదని చెబుతున్నా వైరస్ కు అందరు భయపడాల్సిందే అని వాదిస్తున్నారు.దీంతో ప్రైవేటు యాజమాన్యాలకు తలొగ్గుతారా? లేక విద్యార్థుల తల్లిదండ్రుల మాటలు వింటారా? అనేది తేలాల్సి ఉంది. హైకోర్టు మరో మూడు రోజుల్లో తమ నిర్ణయాలు ప్రకటించాలని సూచించిన సందర్భంలో ఏం నిర్ణయాలు తీసుకుంటారో అని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
Also Read: జగన్ మాస్టర్ స్ట్రోక్.. బాబుకు ‘బొమ్మ’ కనబడిందిగా..!
[…] […]