https://oktelugu.com/

Smita Sabharwal: స్మితా సభర్వాల్ కు షాకిచ్చిన హైకోర్టు

Smita Sabharwal: తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఓ కేసులో ప్రభుత్వం నుంి తీసుకున్న రూ. 15 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మితా సబర్వాల్ పరిస్థితి గందరగోళంలో పడింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ అవుట్ లుక్ మ్యాగజైన్ యాజమాన్యంపై పరువు నష్టం దావా వేసేందుకు గాను ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు తీసుకుంది. దీంతో వాటిని […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 3, 2022 / 11:46 AM IST
    Follow us on

    Smita Sabharwal: తెలంగాణ హైకోర్టు ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు పెద్ద షాక్ ఇచ్చింది. ఓ కేసులో ప్రభుత్వం నుంి తీసుకున్న రూ. 15 లక్షలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో స్మితా సబర్వాల్ పరిస్థితి గందరగోళంలో పడింది. సీఎం కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న స్మితా సబర్వాల్ అవుట్ లుక్ మ్యాగజైన్ యాజమాన్యంపై పరువు నష్టం దావా వేసేందుకు గాను ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు తీసుకుంది. దీంతో వాటిని తిరిగి చెల్లించాలని కోర్టు స్పష్టం చేసింది.

    Smita Sabharwal

    స్మితా సబర్వాల్ నుంచి సదరు సొమ్ము రికవరీ చేయాలని జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ, జస్టిస్ అభినందన్ కుమార్, షావిలి ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది. 2015 జూన్ 18న హైదరాబాద్ లోని ది పార్క్ హోటల్ లో స్మితా సబర్వాల్ తన భర్త అకున్ సబర్వాల్ తో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. దీంతో అవుట్ లుక్ వారపత్రిలో వీరి క్యారికేచర్ తో నో బోరింగ్ బాబు అంటూ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దీంతో స్మితా సబర్వాల్ ఆ పత్రికపై పరువునష్టం దావా వేసేందుకు ప్రభుత్వం నుంచి రూ. 15 లక్షలు తీసుకుని న్యాయపోరాటం చేస్తోంది.

    Also Read: KTR- AP TDP Leaders: కేటీఆర్ పై గురిపెట్టి వైసీపీని కాలుస్తున్న టీడీపీ..

    దీంతో అవుట్ లుక్ యాజమాన్యం, వి. విద్యాసాగర్, కె. ఈశ్వర్ రావు అనే వ్యక్తులు ప్రభుత్వ నిధులు ప్రైవేటుకు వాడుకోవడాన్ని సవాలు చేస్తూ వారు కూడా హైకోర్టులో వేరువేరుగా వ్యాజ్యాలు వేశారు. దీంతో విచారణకు స్వీకరించిన హైకోర్టు విచారణ చేపట్టింది. ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ కు ఏ ప్రాతిపదికన ఆర్థిక సాయం చేశారో చెప్పాలని ప్రశ్నించింది. ఎవరైనా అధికారిపై కేసు నమోదైతే వారు విధి నిర్వహణలో ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తుంది కానీ విధి నిర్వహణలో లేనప్పుడు అది ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు ప్రభుత్వ నిధులను ఎలా తీసుకుంటారని ప్రశ్నలు లేవనెత్తింది.

    Smita Sabharwal

    స్మితా సబర్వాలో చేసింది కరెక్టేనని అఖిల భారత సర్వీసు అధికారులకు న్యాయ సహాయం చేయొచ్చని ఆమె తరఫున న్యాయవాది అడ్వకేట్ జనరల్ బీఎన్ ప్రసాద్ వాదింంచినా ధర్మాసనం తోసిపుచ్చింది. అధికారిక విధుల్లో ఉన్నప్పుడు తలెత్తే వివాదాల్లో సాయం చేయాలే కానీ ఇలా ప్రైవేటు కార్యక్రమాలకు కాదని తేల్చింది. ప్రభుత్వం నుంచి తీసుకున్న రూ. 15 లక్షలు 90 రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాలని లేని పక్షంలో 30 రోజుల్లో ప్రభుత్వమే స్వయంగా ఆమె నుంచి తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేయాలని సూచించింది.

    Also Read:YCP Botsa Roja: మంత్రిగా ఇంకా బాధ్యతలు తీసుకోని ‘బొత్స’..అలకకు కారణమేంటి? రోజాది అదే పరిస్థితి?

    Recommended Videos:

    Tags