https://oktelugu.com/

Bigg Boss Telugu OTT: డ్రామా క్వీన్ మిత్రా కి తన స్టైల్ లోనే ఇచ్చిపడేసిన బిందుమాధవి

Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ సోమవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచింది. ఆషు విషయంలో యాంకర్ శివ అన్న డైలాగులు చిచ్చుపెట్టాయి. నామినేషన్స్ లో అందరికీ టార్గెట్ గా శివ మారారు. ఆఖరుకు స్నేహితురాలైన బిందుమాధవి సైతం శివను నామినేట్ చేసింది. ఇక నామినేషన్స్ లో హైలెట్ ఏంటంటే.. మిత్రా శర్మకు, బిందుమాధవికి మధ్య జరిగిన నామినేషన్స్ గొడవ రక్తికట్టింది. బిందుమాధవి విశ్వరూపాన్నే చూపించింది. తనదైన […]

Written By:
  • NARESH
  • , Updated On : May 3, 2022 / 12:38 PM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ సోమవారం నామినేషన్స్ మరింత హీట్ పెంచింది. ఆషు విషయంలో యాంకర్ శివ అన్న డైలాగులు చిచ్చుపెట్టాయి. నామినేషన్స్ లో అందరికీ టార్గెట్ గా శివ మారారు. ఆఖరుకు స్నేహితురాలైన బిందుమాధవి సైతం శివను నామినేట్ చేసింది.

    Bindu Madhavi

    ఇక నామినేషన్స్ లో హైలెట్ ఏంటంటే.. మిత్రా శర్మకు, బిందుమాధవికి మధ్య జరిగిన నామినేషన్స్ గొడవ రక్తికట్టింది. బిందుమాధవి విశ్వరూపాన్నే చూపించింది. తనదైన స్టైల్లో ఇచ్చిపడేసింది. నామినేషన్స్ లో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన చేదు లడ్డూను మిత్రాకు ఇచ్చింది బిందుమాధవి. తన చేయి తనకు తగిలిందని.. ఫిజికల్ గా హ్యాండిల్ చేస్తోందని మిత్ర శర్మ తనదైన స్టైల్లో రెచ్చిపోయింది. కావాలనే రచ్చ చేసి ఏమోషన్ ను పండించింది.

    Also Read: Prabhas Salaar: ప్రభాస్ రొమాన్స్ పూర్తి అయ్యింది.. మరోపక్క వీడియో క్లిప్ వైరల్ !

    దీంతో డ్రామా క్వీన్ గా సెంటిమెంట్ పండించిన మిత్రాకు తనదైన స్టైల్లో బిందుమాధవి ఇచ్చిపడేసింది. తనదైన స్టైల్లో మిత్రాను ఓ ఆట ఆడుకుంది. నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య జరిగిన సంవాదమే హైలెట్ గా చెప్పొచ్చు.

    Mitraaw Sharma

    బిందుమాధవి తనలోని నట విశ్వరూపాన్నే ఈ నామినేషన్స్ లో ప్రదర్శించింది. అచ్చంగా మిత్రాలాగా ప్రవర్తిస్తూ.. ఆమెను ఇమిటేట్ చేస్తూ ఎండగట్టింది. మిత్రాను ఉతికి ఆరేసింది. ఆమె హోయలు, షెకలు అన్నింటిని నటించి మరీ తూర్పారపట్టింది.

    ఇక ఆ తర్వాత శివ స్టాండ్ తీసుకోవడంపై కూడా బిందు నామినేట్ చేసి షాకిచ్చింది. ‘నువ్వు గిల్టీగా ఫీల్ అవ్వడం లేదని.. నువ్వు అన్న మాటలు చాలా తప్పు అంటూ క్లారిటీ ఇచ్చేసింది బిందు.

    ఇలా నామినేషన్స్ లో బిందుమాధవి చేసిన హంగామా.. రచ్చ దెబ్బకు మిత్రా శర్మ సహా ఇంటిసభ్యులంతా అలా నిశ్చేష్టులుగా చూస్తూ ఉండిపోయారు.

    Also Read:Malavika: సీనియర్ హీరోయిన్ కొత్త సిరీస్.. ఎలా ఉంటుందో మరి ?

    Recommended Videos:

    Tags