జగన్ కి దెబ్బ మీద దెబ్బ

ఏపీ స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లిన జగన్ సర్కార్ కి షాక్ తగిలింది. అది మారువకముందే ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు […]

Written By: Neelambaram, Updated On : March 21, 2020 12:28 pm
Follow us on

ఏపీ స్థానిక ఎన్నికలను ఆరు వారాల పాటు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్లిన జగన్ సర్కార్ కి షాక్ తగిలింది. అది మారువకముందే ఇప్పుడు మరో దెబ్బ తగిలింది. కర్నూలుకు కార్యాలయాల తరలింపు ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ మూడు రాజధానుల ప్రతిపాదనల్లో భాగంగా..కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..న్యాయ విభాగం పరిధిలోకి వచ్చే శాఖలను కర్నూలును తరలించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. విజిలెన్స్ కమిషన్, కమిషనరేట్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాలయాలకు కర్నూలుకు తరలిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జీవోల జారీ విషయంలోనూ వివాదం నెలకొని ఉంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పూర్తి సమాచారం లేకుండానే ముఖ్యమంత్రి కార్యాలయంలోని ఒక అధికారి సూచన మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగింది. ఈ జీవోల పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ల పైన ప్రభుత్వ వివరణ కోరింది. ప్రభుత్వం నుండి సమాధానం వచ్చిన తరువాత హైకోర్టు కర్నూలుకు కార్యాలయాల తరలింపు జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
ప్రభుత్వం ప్రతిపాదించిన మూడు రాజధానుల బిల్లులు అసెంబ్లీలో ఆమోదం పొందినా..మండలిలో సెలెక్ట్ కమిటీకి పంపాలని ఛైర్మన్ ఆదేశించారు. దీని పైన రాజకీయంగా వివాదం నెలకొని ఉంది. ఇప్పటి వరకు కమీటీల ఏర్పాటు సైతం జరగలేదు. దీంతో..నాలుగు నెలల సమయం తరువాత ఇక సెలెక్ట్ కమిటీకి వెళ్లాల్సిన అవసరం లేదని..సాంకేతికంగా ఆ బిల్లులు ఆమోదం పొందినట్లేనని ఏపీ ప్రభుత్వ కొత్త వాదన తెర మీదకు తెచ్చింది. అయితే, టీడీపీ మాత్రం ఈ వాదనతో విభేదిస్తోంది. ఈ పరిస్థితుల్లో కర్నూలుకు న్యాయ పరమైన విభాగాల తరలింపుకు ఇచ్చిన ఉత్తర్వుల పైన హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి.