https://oktelugu.com/

తెలంగాణలో కరోనా తీవ్రత.. హైకోర్టు కీలక ఆదేశాలు..

కరోనా మహ్మారి తెలంగాణలో విలయతాండవం చేస్తోంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం అయితే ఏకంగా రెండువేల మార్క్ కు సమీపానికి కేసులు చేరువయ్యాయి. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చిస్తున్నారు. టెస్టుల సంఖ్య, వ్యాక్సినేషన్ల […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 8, 2021 / 03:08 PM IST
    Follow us on


    కరోనా మహ్మారి తెలంగాణలో విలయతాండవం చేస్తోంది. రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. గురువారం అయితే ఏకంగా రెండువేల మార్క్ కు సమీపానికి కేసులు చేరువయ్యాయి. దీంతో ప్రజలతో పాటు ప్రభుత్వం సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసుల కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను గురించి చర్చిస్తున్నారు. టెస్టుల సంఖ్య, వ్యాక్సినేషన్ల సంఖ్యను పెంచాలని ఈటల రాజేందర్ వైద్యారోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

    కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఇటు ప్రభుత్వం తో హైకోర్టు రంగంలోకి దిగింది. కేసుల కట్టడికి, వైరస్ ను అదుపు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకుంటేనే రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. తెలంగాణలో కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్వర్వలు జారీ చేసింది.

    సరిహద్దుల్లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించిన తరువాతే.. రాష్ట్రంలోకి అనుమతి ఇవ్వాలని.. క్లబ్బులు, పబ్బులు, సినిమా థియేటర్లపై ఆంక్షలు విధించాలని సూచించింది. వందమంది ఉద్యోగులు ఉన్న కార్యాలయాల్లో తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలకు సంబంధించిన నివేదికను ప్రభుత్వం గురువారం హైకోర్టుకు అందించింది.

    దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం కరోనా కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్యను భారీగా పెంచాలని, కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మాస్కులు ధరించనివారిపై ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదు చేశారో వివరణ ఇవ్వాలని హైకోర్టు కోరింది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.