https://oktelugu.com/

పదో తరగతి పరీక్షల నిర్వహణలో చిన్న మెలిక!

తెలంగాణలో పదో తరగతి పరీక్షల వ్యవహారం హైకోర్టులో తేలడం లేదు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని కోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. ఐతే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా.. అని ఏజీని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు కంటైన్మెంట్ జోన్లలో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 5, 2020 / 04:20 PM IST
    Follow us on

    తెలంగాణలో పదో తరగతి పరీక్షల వ్యవహారం హైకోర్టులో తేలడం లేదు. పరీక్షల నిర్వహణపై శుక్రవారం కూడా కోర్టులో విచారణ జరిగింది. పరీక్షల నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్ల హాస్టళ్లను తాత్కాలికంగా తెరిచేందుకు అనుమతిస్తామని కోర్టుకు తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. ఈసారి పరీక్షలు రాయలేని వారికి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పిస్తామని కీలక వ్యాఖ్యలు చేసింది. ఐతే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాసే వారిని రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణిస్తారా..

    అని ఏజీని ప్రశ్నించింది కోర్టు. అంతేకాదు కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది? దీనిపై ప్రభుత్వం అభిప్రాయాన్ని తెలుసుకొని రేపు కోర్టుకు తెలుపుతామని ఏజీ చెప్పారు. ఈ నేపథ్యంలో టెన్త్ పరీక్షలపై విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు.