Homeజాతీయ వార్తలుHigh Alert In Kashmir: ఆ ఇద్దరే టార్గెట్‌! కశ్మీర్ లో మళ్లీ హైఅలెర్ట్.. ఏం...

High Alert In Kashmir: ఆ ఇద్దరే టార్గెట్‌! కశ్మీర్ లో మళ్లీ హైఅలెర్ట్.. ఏం జరిగింది?

High Alert In Kashmir: న్యూ ఇయర్‌ రాబతోంది. కొద్ది రోజులోల వసంత కాలం వస్తుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ మంచుతో అందాలు సంతరించుకుంది. ఈ తరుణంలో ఉగ్ర కదలికలు ఆందోళన కలిగిస్తున్నయి. సరిహద్దులో చొరబాటుల పెరుగుతున్నాయి. ప్రముఖ ఉగ్రవాదుల కదలికలతో హై అలర్ట్‌ నెలకొంది. టూరిజం సీజన్‌లో పహల్గాం లాంటి దాడులు జరపాలని ఉగ్రవాదులు కుట్రలు పన్నుతున్నారని ఇంటెలిజెన్స్‌ సమాచారం.

ఉగ్రవాదుల చొరబాటు సమాచారం..
అనంత్‌నాగ్‌ ప్రాంతంలో లతీఫ్‌ భట్‌ కదలికలను నిఘా వర్గాలు గుర్తించాయి. అతని దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో నమోదయ్యాయి. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్‌గా ఉన్న లతీఫ్, కశ్మీర్‌ రెవల్యూషనరీ ఆర్మీలో కీలక నాయకుడు. అతనితోపాటు పాకిస్తాన్‌కు చెందిన హంజుల్లా కూడా సరిహద్దు దాటి భారీ కుట్రలు అమలు చేయడానికి చేరుకున్నాడని అనుమానం. ఈ ఇద్దరూ నెల రోజులుగా కశ్మీర్‌లో తిరుగుతూ తరచూ స్థావరాలు మారుస్తున్నారు. వారికి స్థానిక సహకారం ఉందా అని భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. లష్కర్‌ ఎతోయిబా అనుబంధ సంస్థలు ఈ కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నాయని నిఘా సమాచారం.

సరిహద్దు గ్రామాల్లో కూంబింగ్‌..
ఎల్‌లోసీ దగ్గర 80 గ్రామాల్లో భద్రతా దళాలు తీవ్ర తనిఖీలు చేపట్టాయి. 40 మంది పాకిస్తాన్‌ ఉగ్రవాదులు చొరబడినట్లు సమాచారం చేరుకుని, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్, జెకే పోలీసు బలగాలు కలిసి గాలిపు చేపట్టాయి. ఎన్‌గర్‌ ప్రాంతంలో కూడా ఇదే రీతి చర్యలు. శీతాకాల వాతావరణం చొరబాట్లకు అనుకూలంగా ఉండటంతో, పాక్‌ ఐఎస్‌ఐ మద్దతుతో మరిన్ని ఆక్రమణలు జరగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. కొన్ని రోజుల క్రితం పాకిస్తాన్‌ 72 టెర్రర్‌ లాంచ్‌ ప్యాడ్లను పునఃస్థాపించడం ఈ కార్యకలాపాలకు సంకేతం.

టూరిజం, రిపబ్లిక్‌ డే లక్ష్యాలపై దృష్టి
టూరిస్టు సీజన్‌ ప్రారంభానికి ఉగ్రవాదుల కదలికలు పెద్ద సవాల్‌. పహల్గాం లాంటి ప్రసిద్ధ ప్రదేశాల్లో దాడులు రూపొందించాలని ఉగ్రవాదులు ప్రణాబద్ధులవుతున్నారు. రిపబ్లిక్‌ డే వేడుకలను కూడా టార్గెట్‌ చేసే అవకాశం గుర్తించారు నిఘా వర్గాలు. భద్రతా దళాలు టూరిస్టు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఈ చర్యలతో ప్రజలకు ఇబ్బంది జరిగినా, భద్రతను ప్రాధాన్యత ఇచ్చారు.

ఈ కదలికలు ప్రాంతీయ స్థిరత్వాన్ని బెదిరిస్తున్నాయి. పాకిస్తాన్‌ మద్దతు, స్థానిక సహకారాలు గుర్తించి కట్టడి చర్యలు తీసుకోవాలి. ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి, సరిహద్దు రక్షణను మెరుగుపరచడం కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version