https://oktelugu.com/

ప్రజలకు హైఅలెర్ట్: తెలంగాణలో జల విలయం

తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి వర్షాలకు వాగులు, వంకలు, నదులు నిండిపోయాయి. ఇన్నాళ్లు ఖాళీగా ఉండి బోసిపోయిన ఉత్తరతెలంగాణ ప్రదాయినీ శ్రీరాంసాగర్ నిండిపోయింది. ఇప్పుడు గేట్లు తెరిచి నీటిని వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది. అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో అయితే కుంభవృష్టి కురుస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రం, భైంసా మొత్తం నీటితో మునిగిపోయింది. మెడ వరకు లోతును మించి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చింది. స్వర్ణ జలాశయం ఆరు గేట్లు […]

Written By:
  • NARESH
  • , Updated On : July 22, 2021 6:28 pm
    Follow us on

    తెలంగాణలో కుంభవృష్టి కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి కురుస్తున్న ఎడతెరపి వర్షాలకు వాగులు, వంకలు, నదులు నిండిపోయాయి. ఇన్నాళ్లు ఖాళీగా ఉండి బోసిపోయిన ఉత్తరతెలంగాణ ప్రదాయినీ శ్రీరాంసాగర్ నిండిపోయింది. ఇప్పుడు గేట్లు తెరిచి నీటిని వదిలేస్తున్న పరిస్థితి నెలకొంది.

    అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ లో అయితే కుంభవృష్టి కురుస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రం, భైంసా మొత్తం నీటితో మునిగిపోయింది. మెడ వరకు లోతును మించి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చింది. స్వర్ణ జలాశయం ఆరు గేట్లు ఎత్తడంతో నిర్మల్ జిల్లా కేంద్రంలోని కాలనీల్లోకి నీరు వచ్చి చేరి నీట మునిగింది.చాలా మంది కాలనీ ప్రజలు చిక్కుకుపోయి సాయం కోసం చూస్తున్నారు. ఉదయం నుంచి తాగడానికి నీళ్లు లేక ప్రజలు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఎదురుచూస్తున్నారు.కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక అధికారులు అక్కడికి చేరుకొని తాళ్లు తెప్పలతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

    ఇక భైంసా పట్టణం కూడా ముంపులో చిక్కుకుంది. గడ్డెన్నవాగు గేట్లు ఎత్తివేయడంతో వరదనీరు టౌన్ ను ముంచెత్తింది. ఆటోనగర్ అయితే మనిషి మునిగేంతగా నీరు వచ్చి చేరింది. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఆటోనగర్ వాసులు ఇళ్ల పైకప్పులు ఎక్కి సాయం కోసం వేడుకుంటున్నారు. అక్కడ 60 మంది వరకు చిక్కుకుపోయినట్టు తెలిసింది.

    నిర్మల్ జిల్లా మునిగిపోవడంతో అక్కడికి వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేసీఆర్ కృష్ణ, గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరదపరిస్థితి, చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎస్పారెస్పీ ప్రాజెక్ట్ వద్ద అప్రమత్తంగా ఉండాలని చూసించారు. ముంపు ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ముందస్తు చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించారు.

    ఇక మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు తెలంగాణలో పడుతాయని తేలడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. అన్ని జిల్లాల అధికారులు, మంత్రులకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి ఆరాతీస్తున్నారు. తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో హైఅలెర్ట్ ప్రకటించారు. అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.