Homeజాతీయ వార్తలుHyderabad Drinking Water Supply Alert: హైదరాబాద్ వాసులందరికీ హైఅలెర్ట్.. నేడు, రేపు వాటర్ బంద్.....

Hyderabad Drinking Water Supply Alert: హైదరాబాద్ వాసులందరికీ హైఅలెర్ట్.. నేడు, రేపు వాటర్ బంద్.. ఏ ప్రాంతాలకంటే?

Hyderabad Drinking Water Supply Alert: గ్రేటర్ హైదరాబాద్ కు మంచినీటి సమస్య ఎదురుకానుంది. ఇన్నాళ్లు ఏ ఇబ్బంది లేకుండా తాగునీరు సరఫరా చేసిన మహానగర పాలక సంస్థ రేపు తాగునీరు సరఫరా నిలిపివేయనుంది. ఫలితంగా కొన్ని కాలనీలు తాగునీటి సమస్య ఎదుర్కోనున్నాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడనున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 16న ఉదయం ఆరు గంటల నుంచి నీటి సరఫరా ఆగిపోతుంది. దీంతో సదరు కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని చెబుతున్నారు. 36 గంటల పాటు నీటి సరఫరా నిలిచిపోనుంది.

Hyderabad Drinking Water Supply Alert
Hyderabad Drinking Water Supply Alert

నగరంలోని దాదాపు 3.5 లక్షల మందికి మంచినీటి సరఫరా అందకుండా పోనుంది. దీంతో ఫలక్ నుమా ప్రాంతంలోని అల్ జుబైల్ కాలనీలో జరుగుతున్న ఫ్లై ఓవర్ నిర్మాణం కారణంగా మీరాలం అలియాబాద్ పైప్ లైన్స్ షట్ డౌన్ తో తాగునీటి సరఫరా ఆగనుందని తెలుస్తోంది. నగరంలో తాగునీరు సరఫరా ఆగిపోయే ప్రాంతాల్లో మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ, సంతోష్ నగర్, వినయ్ సాగర్, సైదాబాద్, చంచల్ గూడ, అస్మాన్ గడ్, యకుత్ పురా, మాదన్నపేట, మహబూబ్ మేన్షన్, రియసత్ నగర్, అలియాబాద్, బాలాపూర్, బొగ్గులకుంట, అఫ్జల్ గంజ్, నారాయణ గూడ, ఆడిక్ మెట్, శివమ్, నల్లకుంట, చిలకలగూడ, దిల్ సుఖ్ నగర్, బొంగుళూరు, మన్నెగూడ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలచిపోనుంది.

Also Read: Telangana Ministers Controversies: మేము మంత్రులం.. మా నియోజకవర్గాలకు సామంత రాజులం

ఇంకా నగరంలోని పాక్షికంగా నీటి సరఫరా నిలిచిపోయే ప్రాంతాల్లో మెహదీపట్నం, కార్వాన్, లంగర్ హౌస్, కాకతీయనగర్, హనుమాన్ నగర్, తల్లగడ్డ, ఆసిఫ్ నగర్, ఎంఈఎస్, షేక్ పేట్, ఓయూ కాలనీ, టోలీచౌకీ, మల్లేపల్లి, విజయనగర్ కాలనీ, భోజగుట్ట, చింతల్ బస్తీ, ఆళ్లబండ, జియాగూడ, రెడిహిల్స్, సెక్రె టెరియేట్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, గగన్ మహల్, హిమాయత్ సాగర్, బద్వేల్, హైదర్ గూడ, రాజేంద్రనగర్, ఉప్పరపల్లి, సులేమాన్ నగర్, ఎంఎం పహాడి, చింతల్ మెట్, కిషన్ బాగ్, మణికొండ, గంధంగూడ, నార్మింగ్, కిస్మత్ పుర, బాలాపూర్,

Hyderabad Drinking Water Supply Alert
Hyderabad Drinking Water Supply Alert

మైసారం, బండ్లగూడ, బర్కాస్, మేకలమండి, భోరక్ పూర్, తార్నాక, లాలాపేట్, బౌద్ధనగర్, మారేడ్ పల్లి, కంట్రోల్ రూం, రైల్వేస్, కంటోన్మెంట్, ప్రకాశ్ నగర్, పాటిగూడ, హన్మత్ పేట, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్, వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, తాటిఖానా, లాలాపేట్, సాహెబ్ నగర్, ఆటోనగర్, సరూర్ నగర్, వాసవి, సైనిక్ పురి, మౌలాలి, స్నేహపురి, కైలాసగిరి, దేవేంద్ర నగర్, గచ్చిబౌలి, మాధాపూర్, అయ్యప్ప సొసైటీ, కావూరి హిల్స్, మధుబన్, దుర్గానగర్, సులేమానగర్, గోల్డెన్ హైట్స్, మల్లికార్జున నగర్, మానిక్ చంద్, చెంగిచర్ల, భరత్ నగర్, పీర్జాదిగూడ, కిస్మత్ పూర్, ధర్మశాయి ఇంకా కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగనుందని ప్రకటిస్తోంది.

నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఆగిపోవడంతో కలిగే ఇబ్బందులను తొలగించుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించుకోవాలని సూచిస్తున్నారు. ప్రజలకు కలుగుతున్న అసౌకర్యానికి ప్రజలు సహకరించాలని చెబుతున్నారు. నీటిని పొదుపుగా వాడుకుని నీటి కష్టాలను అధిగమించాలని సూచిస్తున్నారు. 36 గంటల పాటు జరిగే నీటి సరఫరా ఇబ్బందులను తొలగించుకునే క్రమంలో ప్రజలు సహకరించాలని కోరుతున్నారు.

Also Read:Munugode Bypoll: హుజూరాబాద్ ను మించి మునుగోడు.. ఎంతెంత ఇస్తున్నారో తెలుసా?

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular