Hidden Camera in Hostel: ఇటీవల కాలంలో అమ్మాయిల బాత్రూంలు.. వాష్ రూమ్లలో స్పై కెమెరాలను పెట్టడం పరిపాటిగా మారిపోయింది. చివరికి ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత.. పోలీసులు విచారణ జరిపిన తర్వాత దిమ్మతిరిగిపోయే వాస్తవాలు సభ్య సమాజానికి తెలియడం పరిపాటిగా మారిపోయింది.. అయితే ఇటువంటి ఘటన తమిళనాడు రాష్ట్రంలోని హోసూర్ ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు ఆ రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు ప్రాంతంలో ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన లేడీస్ హాస్టల్ ఉంది.. ఇక్కడ వందల మంది అమ్మాయిలు వసతి పొందుతున్నారు.. అయితే ఇటీవల ఓ అమ్మాయి వాష్ రూమ్ వెళ్ళింది.. తను వెళ్లి వస్తుండగా ఏదో మెరిసినట్టు కనిపించింది. ఇది విషయాన్ని తన తోటి స్నేహితురాళ్లకు చెప్పింది. దీంతో వారు ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేయలేదు. జాగ్రత్తగా పరిశీలిస్తే తమ వాష్ రూమ్ లలో ఎవరో స్పై కెమెరాలు పెట్టినట్టు గుర్తించారు. అంతేకాదు తమ దృశ్యాలను రికార్డు చేసినట్లు కూడా గుర్తించారు..
ఈ విషయాన్ని ఆ హాస్టల్ లో ఉండే అమ్మాయిలు తేలికగా వదిలిపెట్టలేదు. తమకు న్యాయం చేయాలని.. ఆ వీడియోలను చిత్రీకరించిన వ్యక్తిని శిక్షించాలని డిమాండ్ చేశారు.. హాస్టల్ ఎదుట వందలాది మంది యువతులు ఆందోళనకు దిగారు. దీంతో ఈ విషయం పోలీసులకు తెలిసింది. ఫలితంగా వారు రంగంలోకి దిగారు. వేగంగా విచారణ మొదలుపెట్టారు. పోలీసుల విచారణలో ఆ కెమెరాలు పెట్టింది ఓ మహిళ అని తేలింది. తన బాయ్ ఫ్రెండ్ కోరిక మేరకు ఆమె అమ్మాయిల బాత్రూంలలో రహస్య కెమెరాలు ఏర్పాటు చేసినట్లు చెప్పింది. ఆ కెమెరాల ద్వారా రికార్డు చేసిన దృశ్యాలను ఓ తరహా వీడియోలను టెలికాస్ట్ చేసే వెబ్సైట్లకు అమ్మినట్టు తెలిసింది. దీంతో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.. ఆమె స్నేహితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు.. వాష్ రూమ్లలో ఏర్పాటుచేసిన స్పై కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు.. ఆ యువతులు భారీగా ఆందోళన చేయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం నిందితులపై చర్యలు తీసుకుంటామని బాధిత అమ్మాయిలకు హామీ ఇచ్చింది.
Hosur–Kelamangalam road blocked!
Women workers at Tata Electronics protest after alleging hidden cameras in hostel restrooms.
Protest continues till morning; police investigating.#HosurNews #WomenSafety #BreakingUpdate#TataElectronics #Kelamangalam #Rayakottai #WomenRights… pic.twitter.com/IOjSfocLJm— HosurOnline Hosur – News Videos (@HosurOnline_Com) November 5, 2025