https://oktelugu.com/

ఎంసెట్‌ ఆప్షన్ల నమోదులో అందుకే ఆలస్యం

కరోనా కారణంగా ఈ ఏడాది ఎడ్యుకేషన్‌ ఇయర్‌‌ గందరగోళంగా పడింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఎగ్జామ్స్‌ లేకుండానే ప్రమోట్‌ చేశారు. తెలంగాణ ఎంసెట్‌ను కూడా ఆలస్యంగానే నిర్వహించారు. కొవిడ్ రూల్స్‌ పాటిస్తూ ఎగ్జామ్‌ నిర్వహించారు. వీటి రిజల్ట్స్‌ 6న విడుదల చేశారు. అయితే.. పలు కారణాల దృష్ట్యా ఈనెల నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. ఇంజినీరింగ్‌ విభాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు ప్రభుత్వం ఇంకా పర్మిషన్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2020 / 11:55 AM IST
    Follow us on

    కరోనా కారణంగా ఈ ఏడాది ఎడ్యుకేషన్‌ ఇయర్‌‌ గందరగోళంగా పడింది. గత విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు ఎలాంటి ఎగ్జామ్స్‌ లేకుండానే ప్రమోట్‌ చేశారు. తెలంగాణ ఎంసెట్‌ను కూడా ఆలస్యంగానే నిర్వహించారు. కొవిడ్ రూల్స్‌ పాటిస్తూ ఎగ్జామ్‌ నిర్వహించారు. వీటి రిజల్ట్స్‌ 6న విడుదల చేశారు. అయితే.. పలు కారణాల దృష్ట్యా ఈనెల నేటి నుంచి ప్రారంభం కావాల్సిన ఆప్షన్ల నమోదు ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు.

    ఇంజినీరింగ్‌ విభాగంగా నూతనంగా ప్రవేశపెట్టిన కోర్సులకు ప్రభుత్వం ఇంకా పర్మిషన్‌ రాలేదు. దీంతోపాటు కాలేజీలకు అఫిలియేషన్‌ జారీ ప్రక్రియ పూర్తికాలేదు. దీంతో ఈ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో నిర్వాహకులు పలు మార్పులు చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే టైం టేబుల్‌ ప్రకారం ఈనెల 9 నుంచి ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, స్లాట్‌ బుకింగ్‌ మొదలు పెట్టారు.

    ఈ రోజు నుంచే వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఈనెల 18 నుంచి 22 వరకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చేలా అవకాశం షెడ్యూల్‌లో మార్పులు చేశారు. అనంతరం ఈనెల 24న అభ్యర్థులకు సీట్లు కేటాయించనున్నారు. సీట్లు సాధించిన వారికి ఈనెల 24 నుంచి 28 వరకు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి.. ట్యూషన్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.

    అయితే.. తెలంగాణలో మొత్తం 201 ఇంజినీరింగ్‌ కాలేజీలు ఉన్నాయి. పలు కోర్సుల్లో 1,10,873 సీట్లు ఉన్నాయి. అయితే.. ప్రతీ కాలేజీకి యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇస్తుంది. ఎప్పుడైనా మే నెల చివరి వరకే ఈ అఫిలియేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. కానీ.. కరోనా దృష్ట్యా ఈసారి ఆలస్యం అవుతోంది. కౌన్సెలింగ్‌ ప్రాసెస్‌ మొదలైనా అఫిలియేషన్‌ పూర్తికావడం లేదు.