Hema In MAA Elections: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో గొడవలు చోటుచేసుకుంటున్నాయి. వివాదాలకే కేంద్ర బిందువుగా నిలుస్తోంది. మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ ప్యానెళ్లు పరస్పరం దాడులు చేసుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయని తెలుస్తోంది. దీనిపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు వర్గాల మధ్య గొడవలతో ఉద్రిక్తలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఎటు వైపు వెళ్తుందో అని భయాందోళనలు నెలకొన్నాయి.

ఈ నేపథ్యంల ప్రకాశ్ రాజ్ ప్యానెల్ కు చెందిన హేమ(Hema In MAA Elections) విష్ణు ప్యానెల్ కు చెందిన శివబాలాజీ చేయి కొరికిందని నరేశ్ చెప్పడం దానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గొడవ చోటుచేసుకుంది. దీనిపై హేమ స్పందిస్తూ తాను ఎందుకు శివబాలాజీ చేయాల్సి వచ్చిందో అని స్పష్టం చేసింది. పది మంది ఓ వ్యక్తిని కొట్టడానికి వెళుతుంటే అడ్డుకునే క్రమంలో శివబాలాజీపై అలా చేయాల్సి వచ్చిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తన తప్పేమీ లేదని చెప్పుకొచ్చింది.
మొత్తానికి మా ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. అంతా ప్రశాంతంగా జరుగుతోందని సభ్యుులు చెబుతున్నా పరస్పర ఆరోపణల నేపథ్యంలో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలింగ్ శాతం గతం కంటే ఈసారి పెరిగింది. దీంతో విజయావకాశాలపై ఎవరికి వారే దీమాగా ఉన్నారు. దీంతో ఎవరి వర్గం విజయం సాధిస్తుందో అనే అంచనాలు అందరిలో నెలకొన్నాయి.
దీనిపై శివబాలాజీ స్పందిస్తూ మా ఎన్నికలు సజావుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సరదాగా చేసిన వీడియోలు సంచలనాలు సృష్టిస్తున్నాయి. మరి కాసేపట్లో మా ఎన్నికలు ముగియనున్నాయి. దీంతో ఇరు ప్యానళ్లలో గెలుపుపై లెక్కలు వేసుకుంటున్నాయి. తమకు ఎంత మెజార్టీ వస్తుందని అంచనాల్లో మునిగిపోయాయి. మొత్తానికి మా ఎన్నికలు సజావుగా ముగియడంపై అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.