https://oktelugu.com/

Heavy Rains: ప్రజలకు హెచ్చరిక.. ముంచుకొస్తున్న వర్షాలు, సునామీలా వరద

Heavy Rains: తెలంగాణ పోటెత్తుతోంది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో జనాలు ఇళ్లలోనే భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. కుండపోత వర్షాలతో రోడ్లు అన్నీ చెరువుల్లా మారాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో వర్షాలతో నీట మునిగింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 7, 2021 / 11:53 AM IST
    Follow us on

    Heavy Rains: తెలంగాణ పోటెత్తుతోంది. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోంది. కొన్ని రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. కుండపోత వర్షాలతో రోడ్లు చెరువుల్లా మారాయి. దీంతో జనాలు ఇళ్లలోనే భిక్కుభిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

    కుండపోత వర్షాలతో రోడ్లు అన్నీ చెరువుల్లా మారాయి. కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల పట్టణంలో వర్షాలతో నీట మునిగింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో ఏపీ, తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

    వాతావరణ శాఖ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని.. ఎవరూ బయటకు రావద్దని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ సహా 8 జిల్లాల్లో మూడు రోజులు మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీంతో తెలంగాణ అంతటా రెడ్ అలెర్ట్ ప్రకటించారు.

    ఆదివారం రాత్రి నుంచి పలు తెలంగాణ జిల్లాల్లో వర్షం కురుస్తూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాలతో హైదరాబాద్ లో పరిస్థితులు అధ్వాన్నంగా మారాయి. శేర్ లింగంపల్లి, గండిపేటలో 19.3 మి.మీల వర్షపాతం కురిసింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని బయటకు రావద్దని అధికారులు సూచించారు.

    ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని 8 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించింది. అత్యవసరం తప్పితే ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచనలు చేశారు. బయట ఉన్న వారు కూడా త్వరగా ఇళ్లకు వెళ్లాలంటూ సూచించారు.

    వరంగల్ రూరల్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఎక్కడ చూసినా నీరే కనిపిస్తోంది. వరంగల్ లో రికార్డ్ స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నడికుడలో 38 సెం.మీల వర్షపాతం నమోదైంది. కరీంనగర్ జిల్లాలో వరద భయాంకర వాతావరణం సృష్టిస్తోంది. మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేశారు.