Health Insurance: నేటి సమాజంలో సాధారణ బీమాతోపాటు, ఆరోగ్య బీమా ప్రతి ఒక్కరికీ అవసరమే. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఎవరూ ఊహించలేం. ఉరుకులు పరుగుల జీవితం, వర్క్ బర్డెన్, పగలు, రాత్రి తేడా లేకుండా పని చేయడం, మానసిక ఒత్తిడి.. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈనేపథ్యంలో వైద్యం చేయించుకోవడం భారంగా మారుతోంది. దీంతో చాలా మంది ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తున్నారు. అయితే పేదవారికి ఆరోగ్య బీమా కొనుగోలు కూడా ఇబ్బందిగా మారుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ వంటి ఆరోగ్య బీమా పథకాలు అవలంబిస్తున్నాయి. అయితే ఇవన్నీ 60 ఏళ్లకు మాత్రమే పరిమితం. అయితే అనారోగ్య సమస్యలు 60 దాటిన తర్వాతనే తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర 6పభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 70 ఏళ్లు దాటిన వారికి ఉచితంగా ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపింది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఒక్కొక్కరికి రూ.5 లక్షల వరకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలని నిర్ణయించింది. 2024, సెప్టెంబర్ 11న సమావేశమైన కేంద్ర క్యాబినెట్ దీనికి ఆమోదం తెలిపింది.
ఆదాయంతో సంబంధం లేకుండా..
70 ఏళ్లు దాటిన అందరికీ, ఆదాయ పరిమితితో సంబంధం లేకుండా హెల్త్ స్కీం వర్తింప జేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని 6 కోట్ల మంది సీనియర్ సిటిజను, 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది. ఒక్కో కుటుంబానికి ఉచితంగా రూ.5 లక్షల బీమా వర్తిస్తుంది. దీనిపై సీనియర్లకు అదనంగా 5 లక్షల బీమా కవరేజీ కల్పిస్తారు. బీమా కల్పించేందుకు సీనియర్ సిటిజన్లందరికీ ప్రనత్యేక గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. ఇప్పటికే అమలు చేస్తున్న ఆయుష్మాన్ భారత్ స్కీంకు ఇది అదనం. ఒక కుటుంబంలో ఒకరికన్నా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఉన్నా.. బీమా వర్తిస్తుంది. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య పథకాలైన ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం, సాయుధ దళాల ఆయుష్మాన్ భారత్ స్కీంలో ఉన్నవారు కూడా కొత్త స్కీంలో చేరవచ్చు.
రూ.3,437 కోట్లు కేటాయింపు..
సీనియర్ సిటిజన్ల హెల్త్ స్కీంకు కేంద్రం రూ.3,437 కోట్లు కేటాయించింది. దరఖాస్తులు పెరిగితే మరిన్ని నిధులు కేటాయిస్తుంది. ఈ స్కీం అమలులోకి వచ్చిన తర్వాత పీఎంజేఏవై అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఫోన్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీతో వెరిఫై చేయాలి. మీ కుటుంబ వివరాలు వస్తే.. అర్హత ఉన్నట్లు. https://ayushmanup.in/ tab ఓపెన్ చేసి ఈటీయూలో రిజిస్టర్ యువర్ సెల్ఫ్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు ఎన్‌హెచ్‌ఏ సేతు పోర్టన్ ఓపెన్ అవుతుంది. రిజిస్టర్ బటన్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత కేవైసీ పూర్తి చేయాలి. తర్వాత కార్డు రెడీ అయ్యాక డౌన్‌లోడ్ చేసుకోవాలి.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Health insurance health insurance up to 5 lakhs for all above 70 years
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com